టీమిండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు అటాకింగ్ బ్యాటింగ్ చేస్తూ, అదే స్థాయిలో ప్రత్యార్థులపై యాక్టివ్ గా ఉంటాడు అంబటి రాయుడు. అలాగే చాలాసార్లు అంబటి రాయుడు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బాట్స్ మెన్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
Advertisement
ఐపీఎల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశాడు అంబటి రాయుడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు రాయుడు. రెండు టీంలు అంటే చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల తరఫున ఏకంగా 14 సీజన్లలో 24 మ్యాచులు ఆడినట్లు తెలిపిన అంబటి రాయుడు… 11 ప్లే offs, 8 ఫైనల్ మ్యాచ్లు ఆడినట్లు వెల్లడించాడు. అలాగే ఐదు ట్రోఫీలు సాధించిన జట్టలో తాను భాగస్వామిగా ఉన్నానని… ఇది చాలా అద్భుతమైన ప్రయాణం అని చెప్పుకొచ్చాడు అంబటి రాయుడు.
Advertisement
ఇక ఇప్పటికీ ఈ ప్రయాణం తనకు చాలని… ఐపీఎల్ కు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించాడు. ఇవాళ జరిగే మ్యాచ్ తనకు ఐపీఎల్ కెరీర్ లో చివరిది అని ప్రకటించాడు అంబటి రాయుడు. ఇక ఈ విషయంలో యూటర్న్ అసలు ఉండదని ప్రకటిస్తూ పోస్ట్ పెట్టాడు అంబటి రాయుడు. కాగా ఇవాళ గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఇవాళ్ళ రాత్రి 8 గంటల సమయంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తోనే అంబటి రాయుడు ఐపీఎల్ కెరీర్ ముగియనుంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు..బాబు కంటే తక్కువేనట !
Sharwanand : హీరో శర్వానంద్ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !
పూజా హెగ్డే ఆస్తులు ఎంతో తెలుసా.. స్టార్ హీరోల కంటే ఎక్కువ