Home » ప్ర‌తి రోజూ ప‌ర‌గ‌డుపున వాల్ న‌ట్స్ తింటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

ప్ర‌తి రోజూ ప‌ర‌గ‌డుపున వాల్ న‌ట్స్ తింటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

by Anji
Ad

వాల్ న‌ట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంటాయి. వీటి వినియోగం వ‌ల్ల చాలా ర‌కాల స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి. వాల్ న‌ట్స్‌లో విట‌మిన్లు, ఖ‌నిజాలు, ఫైబ‌ర్‌, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు వంటి ప‌లు ర‌కాల పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మెద‌డు చురుకుద‌నాన్ని పెంచి జ్ఞాప‌క‌శ‌క్తిని మెరుగుప‌రుస్తాయి. థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించ‌డంలో ఇది ప్ర‌భావ‌వంతంగా ఉంటుంది. ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో రెండు వాల్‌న‌ట్‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాటి ప్ర‌భావ‌వంత‌మైన కొన్ని ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

వాల్ న‌ట్స్ ప్ర‌యోజ‌నాలు : 

వాల్‌న‌ట్స్ తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల వ్యాధులు న‌యం అవుతాయి. దీంతో బ‌రువు త‌గ్గ‌డంలో కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంది. ముఖ్యంగా క్యాన్స‌ర్ ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది. ఇది ప్రొస్టేట్ క్యాన్స‌ర్‌, కొలొరెక్ట‌ల్ క్యాన్స‌ర్‌, బ్రెస్ట్ క్యాన్స‌ర్ వంటి వ్యాధుల ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది. వాల్‌న‌ట్స్ లో ఉండే పాలీఫెనాల్ ఎలాజిటానిన్ లు క్యాన్స‌ర్ నుంచి మిమ్మ‌ల్ని ర‌క్షించ‌డంలో స‌హాయ‌ప‌డుతాయి. రోజూ వాల్ న‌ట్స్ తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దంతాల బలం పెరుగుతుంది. ఇందులోఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఎముక‌ల బ‌లాన్ని పెంచుతుంది.

Advertisement

Also Read :  భర్త భార్య ని కాకుండా మరొక స్త్రీని ఇష్టపడటానికి గల 5 కారణాలు ఇవేనట !


నాన‌బెట్టిన వాల్‌న‌ట్‌ల‌ను తీసుకోవ‌డం ద్వారా పెరుగుతున్న శ‌రీర బ‌రువును నియంత్రించుకోవ‌చ్చు. వీటిలో ఉండే ప్రోటీన్లు అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. అదే స‌మ‌యంలో కెల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఇది బ‌రువును నియంత్రిస్తుంది. హృద‌యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాల్‌న‌ట్స్‌లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మ‌ధుమేహాన్ని నియంత్రిస్తాయి. వాల్‌న‌ట్స్ ను ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో తీసుకుంటే మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. ముఖ్యంగా వీటి వినియోగం ద్వారా టైప్‌-2 డ‌యాబెటిస్ ప్ర‌మాదాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

Also Read :  మందు తాగేట‌ప్పుడు చీర్స్ ఎందుకు కొడ‌తారో మీకు తెలుసా..?

Visitors Are Also Reading