Home » అమలాపాల్ రెండో భర్తకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

అమలాపాల్ రెండో భర్తకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

by Bunty

 

అమలాపాల్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. తెలుగులో బెజవాడ సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తన అద్భుతమైన నటనతో వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, మేము వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో అద్భుతంగా నటించింది.  ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది అమలాపాల్.

Amala Paul gets married for the second time

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే 2014 సంవత్సరంలో డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. కేవలం మూడేళ్లపాటు వీరి వివాహ బంధం కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం అమలాపాల్ చాలాకాలం పాటు సింగిల్ గానే ఉంది.  కొన్ని రోజుల క్రితం అమలాపాల్ రెండో వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఈ విషయం తెలిసిన చాలామంది అభిమానులు త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్లు పెట్టారు. రీసెంట్ గా అమలాపాల్ తన ప్రియుడు అయినటువంటి జగత్ దేశాయ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.

కేరళలోని కొచ్చిలో నవంబర్ 5వ తేదీన వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలను వీరిద్దరూ వారి వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. “అమలాపాల్, జగత్ రెండు మనసులు ఒకటైన వేల జీవితాంతం నీ చేయి వదలను” అంటూ జగత్ పోస్ట్ లో క్యాప్షన్ జతచేశాడు. ఇక అమలాపాల్ రెండో భర్త జగత్ దేశాయ్ గుణంలోనే కాదు ధనంలోనే టాప్ ప్లేస్ లో ఉన్నాడని, ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని దేశంలో ఉన్న టాప్ వ్యాపారవేత్తలలో ఈయన పేరు కూడా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈయనకు కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆ ఆస్తులు అన్నింటికీ జగత్ దేశాయ్ ఏకైక వారసుడు అంటూ కూడా నెట్టింట ప్రచారం జరుగుతుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

 

Visitors Are Also Reading