Home » సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు అర్జున్ భార్య..!

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు అర్జున్ భార్య..!

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గంగోత్రి సినిమాతో ఆయన సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఇక  భార్య స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.  కూతురు అర్హ, కొడుకు అయాన్ తో  కలిసి బన్నీ చేసే అల్లరి ఫోటోలు, వీడియోలను స్నేహ రెడ్డి తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది స్నేహ.

Advertisement

Advertisement

హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని అందం, గ్లామర్ తో నేటిజన్ల మనసు దోచుకుంటున్న ఈ అల్లువారి కోడలికి ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా  కాస్త ఎక్కువగానే ఉన్నారు.  ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటి దక్కించుకున్న స్నేహకు రీసెంట్ గా సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఓ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తోంది.

అంతేకాకుండా ఇందులో మలయాళ స్టార్ హీరో నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో వాస్తవం  ఎంతవరకు నిజం ఉందన్నది మాత్రం  తెలియాల్సి ఉంది.  ఒకవేళ ఆమెకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంటే టాలీవుడ్ కాకుండా మాలివుడ్ ను ఎంచుకుంటుందా అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read :  ఒక్క ఫైట్ సీన్ లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading