Telugu News » Blog » ఒక్క ఫైట్ సీన్ లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

ఒక్క ఫైట్ సీన్ లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయనకు దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నటన ప్రస్థానాన్ని కాపాడడంలో బాలకృష్ణ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. అలాంటి బాలకృష్ణ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. నందమూరి బాలకృష్ణ మూవీ అంటేనే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది ఫైట్స్, అదిరిపోయే డైలాగులు. ఆయన పంచ్ డైలాగ్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Advertisement

అలాంటి బాలక్రిష్ణ ఒక్క ఫైట్ మరియు డాన్స్ స్టెప్పు లేకుండా చేసినటువంటి చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ చిత్రమే “నారి నారి నడుమ మురారి”. 1990లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో ఒక్క ఫైట్ సీన్, డాన్స్ స్టెప్ కూడా లేకపోవడం మనం గమనించవచ్చు. కేవలం బాలకృష్ణ నటన, సినిమా కథ మూలంతోటే ప్రేక్షకులను మెప్పించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, బాలకృష్ణ సరసాన శోభన, నిరోష జంటగా నటించారు.

Advertisement

also read:మరో సీక్వెల్ తో రాబోతున్న కార్తీ..!

ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను తమిళనాడు రాష్ట్రంలోని వేలచెర్రి అనే ప్రాంతంలో చిత్రీకరించారు. మురారి నిర్మాతగా ఈ చిత్రాన్ని యువచిత్ర పతాక బ్యానర్ పై తెరకెక్కించారు. ఇప్పటికీ సినిమా టీవీలో ప్రసారమైతే మిస్ కాకుండా చూసే అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటి బాలయ్య కెరియర్ లోనే ముఖ్యమైన చిత్రంగా ఈ సినిమా వచ్చింది అని చెప్పవచ్చు.

Advertisement

also read: