ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి తెలియని వారుండరు. ఇక అప్పుడప్పుడు అల్లు అర్జున్, స్నేహారెడ్డి షేర్ చేసే వీడియోల వల్ల అర్హకి సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆమెకు సంబంధించిన వీడియోలన్ని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న శాకుంతలం సినిమాలో కూడా అర్హ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలిసిందే.
Advertisement
శాకుంతలం సినిమా విడుదలవ్వకముందే అప్పుడే మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది అల్లు అర్హ. ఈ సారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి అర్హ వెండి తెర మీద కనిపించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ చిన్న పాప పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. ఇక ఆ పాత్రకు అల్లు అర్హ బాగా సెట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఇప్పటికే అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన త్రివిక్రమ్ అడిగితే బన్నీ కచ్చితంగా ఒప్పుకుంటానే చెప్పుకోవాలి. ఇప్పటికే అల్లు అర్హకి పలువురు సిని దర్శక, నిర్మాతలతో పరిచయం బాగానే ఉంది. అల్లు అర్జున్ ని కలిసిన వారు కొందరూ అర్హని పలకరిస్తూనే ఉంటారు.
Advertisement
Also Read : రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వరుడు ప్రముఖ వ్యాపారవేత్త.. ఎవరంటే..?
గత ఏడాది విజయదశమికి ముందే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత దసరా పండుగ సందర్భంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇక అంతలోనే మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్ను మూశారు. అందులోంచి తేరుకునే లోపు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అందులో మళ్లీ హీరోయిన్ పూజా హెగ్దే కి కూడా గాయం అయినట్టు సమాచారం. ఎట్టకేలకు ప్రస్తుతం సినిమా షూటింగ్ అయితే ప్రారంభమైంది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ కూడా అర్హ ని రంగంలోకి దించేవిధంగా స్క్రిప్ట్ మార్చినట్టు తెలుస్తోంది. మహేష్ సినిమాలో అల్లు అర్హ అంటే సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు.. అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారనే చెప్పుకోవచ్చు.