Home » Trending 10 Telugu Mems and Trolls on IND vs SL 2nd t20 క్రికెట్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండింగ్ మామూలుగా లేదుగా..!

Trending 10 Telugu Mems and Trolls on IND vs SL 2nd t20 క్రికెట్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండింగ్ మామూలుగా లేదుగా..!

by Anji
Ad

Trending 10 Telugu Mems and Trolls on IND vs SL : భారత్, శ్రీలంక మధ్య టీ-20 సిరీస్ లో భాగంగా జనవరి 03, జనవరి 05 తేదీలలో మ్యాచ్ లు జరిగాయి. మరో మ్యాచ్ జనవరి 07న జరుగనుంది. జనవరి 03న జరిగిన మ్యాచ్ లో టీమిండియా శ్రీలంక పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. జనవరి 05న పూణె వేదికగా జరిగిన రెండో టీ 20లో భారత్ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. శ్రీలంక నిర్దేశించిన 207 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్ అర్దశతకాలతో రాణించినప్పటికీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయారు. చివరి వరకు పోరాడిన అక్షర్ చివరి ఓవర్ లో కెప్టెన్ శనక బౌలింగ్ లో క్యాచ్  ఔట్ అయ్యాడు.   టీమిండియా బౌలర్ అర్ష్ దీప్ సింగ్ వరుస నో బాల్స్ తో చెత్త రికార్డు నమోదు చేయడంతో పాటు టీమిండియా ఓటమికి కారకుడు అయ్యాడని పలువురు పేర్కొంటున్నారు. .

Advertisement

రెండో టీ-20 శ్రీలంక విజయం సాధించడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమానం అయింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది శ్రీలంక జట్టు. ఓపెనర్ మెండిస్ ఆఫ్ సెంచరీ చేయగా.. అసలంక 19 బంతుల్లో 37 పరుగులతో రాణించాడు. చివరిలో కెప్టెన్ శనక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 20 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. దీంతో శ్రీలంక స్కోర్ 200 దాటింది. ఇక జనవరి 07న శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనున్నది. రాజ్ కోట్ లో నిర్ణయాత్మక టీ-20 మ్యాచ్ జరుగనుంది. 

ముఖ్యంగా కుశాల్ మెండిస్ 52 పరుగులు, దసున్ శనక (56) పరుగులు చేయడంతో శ్రీలంక భారీ స్కోర్ చేయగలిగింది. ఒక దశలో ఆ జట్టు 8 ఓవర్లలో 80 పరుగులు చేసింది. మధ్యలో స్పిన్నర్లు రన్ రేట్ ని ఉపయోగించుకున్నా శ్రీలంక బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడారు. ప్రధానం శనక, కరుణరత్నే జోడి చివరి 5 ఓవర్లలో 77 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 200 దాటింది. శనక బరిలోకి దిగినప్పుడు మొదటి 7 బంతులకు కేవలం 6 పరుగులు మాత్రమే చేసాడు. ఆ తరువాత గేర్ మార్చి కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు రాబట్టాడు. మరోవైపు టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా 20 బంతుల్లో 50 పరుగులు చేశాడు. చివరి ఓవర్ వరకు చాలా ఉత్కంఠగా కొనసాగింది మ్యాచ్.  సూర్యకుమార్ 36 బంతులలో 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో టీమిండియా గెలుపు ఉన్న ఆశలు ఆవిరయ్యాయి. 

Advertisement

ఇక ఎప్పటి లాగే ఈ మ్యాచ్ లో తన ఫేస్ అటాక్ తో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్. అదేవిధంగా పరుగులు కూడా భారీగానే సమర్పించుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసి భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. మాలిక్ తన తొలి ఓవర్ లో 13 పరుగులు ఇచ్చాడు. రెండో ఓవర్ లో మాత్రం విశ్వరూపం చూపించాడు. పదో ఓవర్ లో తన మొదటి బంతికే శ్రీలంక బ్యాటర్ రాజపక్సే స్టంప్ లను ఎగరగొట్టాడు. 147 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతికి రాజపక్సే వద్ద నుంచి సమాధానం లేకపోయింది. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. ఇక అక్కడితో ఆగలేదు ఉమ్రాన్.. ఆ తరువాత ఓవర్ లో మరింతగా చెలరేగిపోయాడు. ఓ చక్కని బంతితో అసలంకను ఔట్ చేసి ఈ స్పీడ్ స్టర్ తరువాత క్రీజ్ లోకి వచ్చిన హసరంగకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ దెబ్బకు లంక ఆలౌరౌండర్ ఆఫ్ స్టంప్ గాలిలో ఎగిరిపోయింది. అయితే ఉమ్రాన్ తన చివరి ఓవర్ లో మాత్రం హ్యాట్రిక్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్ కి సంబంధించి సోషల్ మీడియాలో పలు అంశాలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. 

Image

Image

Image

 

 

May be an image of 7 people, people playing sport and text

May be an image of 7 people and text that says "*Arshdeep OVER2 40010NN4N6 (19 RUNS) OVER1 RAL ASTRAL 142N6N1 RUNS) *Hardik Pandya SSE BISKET Orey neeku no balls veyyakapothe muddha digadha.."

May be an image of 9 people, beard and text that says "Wide . lu Bye lu kalipina kuda SPCU No Balls kanna takkuve unnai kadara"

May be a meme of 5 people and text that says "CHAI CH BİSKET Hardik* Endhuku bro no balls vesthunnav ALIMAR Arshdeep* Saradhaa"

Visitors Are Also Reading