Home » బన్నీ ఫ్యాన్స్ కు ఊహించని ట్రీట్…పుష్ప ట్రైలర్ టీజ్ విడుదల….!

బన్నీ ఫ్యాన్స్ కు ఊహించని ట్రీట్…పుష్ప ట్రైలర్ టీజ్ విడుదల….!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. తాజాగా ఈ సినిమా ట్రైలర్ టీజ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ తేజ్ లో చూపించి చూపించకుండా ట్రైలర్ లోని పలు సన్నివేశాలను చూపించారు. కాగా ఒక్కో క్లిప్ పుష్ప సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. బన్నీ బైక్ తిప్పడం….అతడి మాస్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక సైతం బైక్ పట్టుకొని దూసుకుపోతున్న సీన్ కనిపిస్తోంది.

Pushpa trailer tese

Pushpa trailer tese

అదేవిధంగా సినిమాలో నటిస్తున్న విలన్ లను సైతం ట్రైలర్ టీజ్ లో చూపించారు. అంతే కాకుండా అనసూయ క్లిప్ ను సైతం చూపించారు. ఇక పూర్తి ట్రైలర్ ను డిసెంబర్ 6 నా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా కథ రెండు పార్ట్ లుగా తెరకెక్కించేందుకు అనువుగా ఉండటం… అదేవిధంగా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువగా అవ్వడంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Advertisement

ఇక సుక్కు ఈ సినిమాపై అంచనాలను రోజురోజుకు పెంచుతున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ బన్నీ సినిమాలో వైల్డ్ లుక్ లో కనిపిస్తుండగా నటీనటులు అంతా ఒక్కొక్కరూ ఒక్కో రేంజ్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమా తో బన్నీ సుకుమార్ ల కాంబో హ్యాట్రిక్ పక్కా అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కు ఆర్య, ఆర్య -2 లాంటి సూపర్ హిట్ చిత్రాలను సుకుమార్ ఇవ్వడంతో ఈ సినిమా పక్కా విజయం సాధిస్తుందని బన్నీ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా మరి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Visitors Are Also Reading