అల్లు వారి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అంటూ పిలిచే రేంజ్ కు ఎదిగాడు. గంగోత్రి సినిమాతో బన్నీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా తరవాత ఆర్య సినిమాతో అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతోనే బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది.
Advertisement
ఈ చిత్రం తరవాత ఇక బన్నీ ఎక్కడా తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. రీసెంట్ గా పుష్ఫ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తున్నాడు. మొదటి పార్ట్ కు పాజిటివ్ టాక్ రావడంతో సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ కు క్రేజ్ పెరిగిపోయింది.
Advertisement
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ పై ఎలాంటి రూమర్స్ లేవన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ హీరో కాస్త ఎర్లీగానే పెళ్లి చేసుకున్నాడు. టీఆర్ఎస్ నేత ప్రముఖ వ్యాపారవేత్త అయిన ప్రభాకర్ రెడ్డి కుమార్తె స్నేహ రెడ్డిని బన్నీ వివాహం చేసుకున్నాడు. అయితే అల్లు అర్జున్ స్నేహరెడ్డి కంటే ముందు ఓ హీరోయిన్ ప్రేమించాడట. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల తార ఐశ్వర్యారాయ్. ఐశ్వర్యరాయ్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నప్పుడు తాను బాధపడ్డానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానించిన సంగతి తెలిసిందే. అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్న తరవాత ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీగా మారిపోయింది.
ALSO READ :
ప్యారిస్ లో లగ్జరీ హోటల్ లో మహేష్ బాబు ఫ్యామిలీ…అక్కడ ఒక్కరోజు అద్దె ఎంతో తెలుసా…!
సర్దార్ టైటిల్ తో వచ్చిన నలుగురు హీరోలు..కానీ హిట్టు కొట్టిన ఒకే ఒక్క హీరో ఎవరంటే..!