Home » స‌ర్దార్ టైటిల్ తో వ‌చ్చిన న‌లుగురు హీరోలు..కానీ హిట్టు కొట్టిన ఒకే ఒక్క హీరో ఎవ‌రంటే..!

స‌ర్దార్ టైటిల్ తో వ‌చ్చిన న‌లుగురు హీరోలు..కానీ హిట్టు కొట్టిన ఒకే ఒక్క హీరో ఎవ‌రంటే..!

by AJAY
Ad

స‌ర్దార్ అనే పిలుపులో ఒక‌ ప‌వ‌ర్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే స‌ర్దార్ అనే టైటిల్ త‌గిలించుకుని ప‌లువురు హీరోలు సినిమాలు కూడా చేశారు. ఇక టైటిల్ తో సినిమాలు చేసిన హీరోలు ఎవ‌రు ఆ సినిమాల రిజ‌ల్ట్ ఏంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఎన్టీరామారావు హీరోగా దాస‌రినారాయ‌ణ రావు ద‌ర్శ‌క‌త్వంలో 1980 సంవ‌త్స‌రంలో స‌ర్దార్ పాపారాయుడు అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమా శ్రీదేవి హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేయ‌గా ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.


సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా ఏ కోదండిరామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 1987లో స‌ర్దార్ కృష్ణ‌మ‌నాయుడు సినిమా వ‌చ్చింది. సినిమాలో విజ‌య‌శాంతి హీరోయిన్ గా న‌టించగా ఊర్వ‌శి,శార‌ద‌లు ముఖ్య‌పాత్ర‌ల‌లో న‌టించారు. ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి బోల్తాకొట్టింది.

Advertisement


రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు హీరోగా భాస్క‌ర రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా స‌ర్దార్ ధ‌ర్మ‌న్న. ఈ సినిమాలో రాధిక‌, జ‌య‌సుధ హీరోహీరోయిన్ లుగా న‌టించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్ హిట్ త‌ర‌వాత దానికి కొన‌సాగింపుగా తెర‌కెక్కించారు. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది.

ALSO READ :

“సర్కారువారిపాట” ట్రైలర్ లో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!

ప్యారిస్ లో లగ్జరీ హోటల్ లో మహేష్ బాబు ఫ్యామిలీ…అక్కడ ఒక్కరోజు అద్దె ఎంతో తెలుసా…!

Visitors Are Also Reading