Home » Allu Arjun : అల్లు అర్జున్ కు అలాంటి అలవాటు ?

Allu Arjun : అల్లు అర్జున్ కు అలాంటి అలవాటు ?

by Bunty
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతిచిన్న వయసులోనే గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు అర్జున్. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేసుకుంటూ పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం తన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Advertisement

ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పుష్ప-2 షూటింగ్ లోకేషన్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఏం చేసినా కూడా అతని ఫ్యాన్స్ ఆ వీడియోని, ఫోటోలని తెగ వైరల్ చేస్తూ ఉంటారు. అంత క్రేజ్ ఉంది అర్జున్ కి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు తండ్రి అయ్యాక మీలో వచ్చిన మార్పు ఏంటి అని అడగ్గా…. దానికి సమాధానంగా అల్లు అర్జున్ నేను పెళ్లికి ముందు చాలా బూతులు మాట్లాడేవాడిని. దాన్ని ఓ వ్యాధిలా భావించా. కానీపెళ్లయ్యాక కాస్త తగ్గించాను.

Advertisement

allu-arjun-in-ads

allu-arjun-in-ads

ఇక పిల్లలు పుట్టిన తర్వాత బూతులు మొత్తం మానేశాను. నాలో చాలా మార్పు వచ్చింది. నేను తండ్రి అయ్యాకే మా నాన్న విలువ నాకు తెలిసింది అని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఈ విషయం తెలిసి చాలా మంది ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఏంటి ఇంత పెద్ద హీరో అయ్యుండి మీరు కూడా బూతులు మాట్లాడతారా అని కామెంట్లు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading