టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షులను అలరించారు. లుక్ పరంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నిరాశపరిచినా ఆర్య సినిమాతో లవర్ బాయ్ గా స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్య తరవాత బన్నీ కెరీర్ లో మళ్లీ తిరిగి వెనక్కి చూసుకోలేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
Advertisement
Also Read: ఉదయ్ కిరణ్ కు పోటీగా బన్నీతో సినిమా చేయాలనుకున్న తేజ..చివరికి ఏమైందంటే..!
కేవలం నటనతోనే కాకుండా తన స్టైలిష్ లుక్ తోనూ బన్నీ ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇక రీసెంట్ గా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. దేశవ్యాప్తంగా తెలుగుతో పాటూ ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. బన్నీ నటనకు బాలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఫిదా అయ్యారు. ఇక పుష్ప సినిమా ముందు నుండి సుకుమార్ చెప్పినట్టుగా అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ అని కూడా అంటున్నారు.
Advertisement
పుష్ప తరవాత బన్నీ ఐకాన్ స్టార్ అని అంతా ఒప్పుకుంటున్నారు కూడా. అయితే బన్నీ గంగోత్రి సినిమా కంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేశాడు. కానీ ఈ విషయం బన్నీ అభిమానులకు పెద్దగా తెలియదు. చిరంజీవి హీరోగా నటించిన విజేత సినిమాలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అలరించాడు.
Also read: “సింహా” టైటిల్ తో బాలయ్య హిట్ కొట్టిన సినిమాలు!
ఇదిలా ఉండగానే ఈ అల్లు వారబ్బాయి కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతి ముత్యం సినిమాలో కూడా నటించి వారెవా అనిపించుకున్నాడు. సినిమాలో బన్నీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు బన్నీ కూతురు అల్లు అర్హా కూడా శాకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మరి బన్నీ కూతురు ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Also Read: IND Vs SL 2nd Test : రిషబ్ పంత్ రికార్డు హాఫ్ సెంచరీ