మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందని.. వేర్వేరుగా కుంపటి పెట్టేశారని రకరకాలుగా కథనాలు వినిపిస్తుంటాయి. అందుకే ఈ మధ్య అల్లు వారు ఎక్కువగా నందమూరితో క్లోజ్‌గా ఉంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ అయితే మెగా ట్యాగ్ ను అస్సలు ఇష్టపడడం లేదని.. తనే సొంతంగా ఓ బ్రాండ్ లా ఎదగాలని అనుకుంటున్నట్టు పలు కథనాలు వినిపిస్తున్నాయి. అందుకే అల్లు వారి పేరు ఎక్కువగా వినిపించాలని ఓ స్టూడియో కట్టిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి : మహేష్ ఫ్యాన్స్ రికార్డుని పవన్ అభిమానులు బీట్ చేస్తారా..?
Advertisement
Advertisement
ఇవన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాసుకున్నారని.. గాలి వార్తలే అని తాజాగా అల్లు అరవింద్ పేర్కొనడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లు అరవింద్ బన్నీకి చిరు మీద ఉన్న ప్రేమ గురించి చెప్పుకొచ్చాడు. బన్నీ అంటే చిరుకి ఎంత ఇష్టమో కూడా వివరించాడు. చిరంజీవికి బన్నీ అంటే కొడుకుతో సమానం అని, బన్నీ ఏం చేసినా చిరంజీవి ఎంజాయ్ చేసేవారట. చిన్నప్పుడు బన్నీ, చరణ్ కలిసి డ్యాన్స్‌లు చేసినవి, అందులో బన్నీని చిరు ప్రోత్సహించడం ఇలా ఎన్నో వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు.
అల్లుఅర్జున్‌కి అయితే చిరంజీవి అంటే చాలా ఇష్టమని.. అల వైకుంఠపురంలో.. ఈవెంట్‌లో బన్నీ ఓడైలాగ్ చెబుతాడు.. ఈ కట్టే కాలే వరకు చిరంజీవి అభిమానినే అంటాడు. ఆ మాట విని కింద కూర్చున్న నాకే అనిపించింది చిరంజీవి అంటే ఎంత అభిమానమో అని.. ఆయన వేరే లెవెల్.. ఆయన స్థాయి అది అంటూ ఇంట్లో ఎప్పుడూ చిరంజీవి గురించి చాలా సందర్భాల్లో బన్నీ చెబుతుంటాడు అని అల్లు అరవింద్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : ప్రభాస్ కోసం భగత్ సింగ్ కథ..!