Home » మ‌హేష్ ఫ్యాన్స్ రికార్డుని ప‌వ‌న్ అభిమానులు బీట్ చేస్తారా..?

మ‌హేష్ ఫ్యాన్స్ రికార్డుని ప‌వ‌న్ అభిమానులు బీట్ చేస్తారా..?

by Anji

టాలీవుడ్ లో ఇప్పుడు స్పెష‌ల్ షో ట్రెండ్ మొద‌లైంది. టాప్ హీరోల సినిమాల్లో సంచ‌ల‌న విజ‌యాలుగా నిలిచినా కొన్ని మూవీస్ ఆయా హీరో పుట్టిన రోజున స్పెష‌ల్ షోలు వేయించ‌డం గ‌త ఏడాది నుంచి ఆన‌వాయితీగా వ‌స్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 షోస్ వేశారు. ఇది చూసిన సూప‌ర్ స్టార్ అభిమానులు ఈ ఏడాద పోకిరి సినిమాని రీ మాస్ట‌ర్ చేయించి చ‌రిత్ర‌లో కనివిని ఎరుగ‌ని రేంజ్‌లో ఏకంగా 370 షోలు వేసి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భంజ‌నం సృష్టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా స్పెష‌ల్ షోల ద్వారా దాదాపు రూ.1కోటి 75ల‌క్ష‌ల‌కు పైగా గ్రాస్‌ని వ‌సూలు చేసింది. ఇది ఒక రికార్డు అనే చెప్ప‌వ‌చ్చు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్ సృష్టించిన అరుదైన రికార్డుని ఎవ‌రు బ్రేక్ చేస్తారనుకుంటున్న స‌మ‌యంలో చిరంజీఇ పుట్టి రోజు వ‌చ్చింది. చిరంజీవి పుట్టిన రోజు మెగా ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌రానా మొగుడు మూవీ స్పెష‌ల్ షోలు వేసుకున్నారు.

ఘ‌రానా మొగుడు చిత్రం అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ పాత సినిమా అవ్వ‌డంతో జ‌న‌రేష‌న్ యూత్ పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. ప్ర‌ధాన ప్రాంతాల్లో హౌస్‌పుల్స్ అయితే ప‌డ్డాయి. కింద ప్రాంతాల్లో ఒక్క‌చోట అస‌లు హౌస్‌పుల్ రాలేదు. ఘ‌రానా మొగుడు సినిమా బ‌దులు ఇంద్ర సినిమా క‌నుక వేసి ఉంటే క‌చ్చితంగా పోకిరి రికార్డు బ‌ద్ద‌లు కొట్టేవార‌మ‌ని మెగా అభిమానులు సోష‌ల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. వాస్త‌వానికి ఇంద్ర సినిమా ప్రింట్ కోసం మెగా అభిమానులు ప్ర‌య‌త్నించారు. కానీ వైజ‌యంతి మూవీస్ వారు ఇంద్ర సినిమాని క‌చ్చితంగా  మార్చి లో విడుద‌ల చేస్తాం. అయితే ఇప్పుడు మాత్రం కాదు.. త్వ‌ర‌లో వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ 50వ వార్షికోత్స‌వం ఘ‌నంగా సినిమా నిర్వ‌హించ‌బోతున్నాం అన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  బాలీవుడ్ కు చెమ‌ట‌లు ప‌ట్టించిన చిరంజీవి..? ఇండ‌స్ట్రీలోనే అరుదైన రికార్డు..! 


మెగా అభిమానులు ఏడాదికి ఘ‌రానా మొగుడు సినిమాని ప్లాన్ చేసుకోవాల్సి వ‌చ్చింది. పోకిరి సినిమా స్పెష‌ల్ షోస్‌కి దాదాపు కోటి 75 ల‌క్ష‌ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు వ‌స్తే ఘ‌రానా మొగుడు సినిమాకి మాత్రం కేవ‌లం 20ల‌క్ష‌ల రూపాయిల గ్రాస్ మాత్ర‌మే వ‌చ్చిందంటూ ట్రేడ్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న స‌మాచారం. పోకిరి సినిమా మేనియా ఘ‌రానా మొగుడు క‌నీసం మ్యాచ్ చేయ‌లేక‌పోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు పోకిరి ని బీట్ చేయ‌గ‌ల స‌త్తా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మాత్రమే ఉంద‌ని.. సెప్టెంబ‌ర్ 02న జ‌ల్సా స్పెష‌ల్ షోల ద్వారా పోకిరి సినిమా రికార్డుల‌ని బ్రేక్ చేస్తామ‌ని ప‌వ‌న్ అభిమానులు స‌వాలు విసిరారు. జ‌ల్సా సినిమా రికార్డు సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి మ‌రి.

  ఇవి కూడా చ‌ద‌వండి : లైగ‌ర్‌ మూవీ ఫ్లాప్ అయితే అని జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు విజ‌య్ స‌మాధానం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading