మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు నటి లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం గత శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మెగా కుటుంబాల సమక్షంలో వరుణ్ మరియు లావణ్య ఉంగరాలు మార్చుకున్నారు. మొదటి నుంచి వారిద్దరూ మా మధ్య ఎటువంటి సంబంధం లేదని ఎన్ని చెప్పినా కూడా సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక కొంతకాలం తర్వాత వాళ్లపై వస్తున్న వార్తలపై వరుణ్, లావణ్య స్పందించడం కూడా మానేశారు. మొదటి నుంచి కూడా ఇద్దరు వారి లవ్ రిలేషన్ ను సీక్రెట్‌గా కంటిన్యూ చేశారు.
Advertisement
లావణ్య మాత్రం పలు సందర్భాలలో చిన్న చిన్న హింట్స్ ఇచ్చినప్పటికీ ఎక్కడో క్లారిటీ మిస్సయ్యింది. ఇదే క్రమంలో లావణ్య, కార్తికేయ జంటగా నటించిన చావు కబురు చల్లగా చిత్ర ఈవెంట్‌లో మాట్లాడుతూ నిర్మాత అల్లు అరవింద్ కొద్దిగా హింట్ ఇచ్చారు. లావణ్య గురించి ఆయన మాట్లాడుతూ.. ఇక్కడే తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. అప్పటి ఆ వీడియో ఇప్పుడు వరుణ్ మరియు లావణ్య నిశ్చితార్థం తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం అల్లు అరవింద్‌కు ముందే తెలుసు అంటూ గుసగుసలు మొదలయ్యాయి.
Advertisement
ఇక ఈ వీడియో విషయానికొస్తే.. మూవీ ఈవెంట్‌లో మీరు కూడా నాలాగే లావణ్య అభిమానులు అంటూ లావణ్య త్రిపాఠిని స్టేజ్ పైకి ఆహ్వానించారు అల్లు అరవింద్. లావణ్య అభిమానులకు హాయ్ చెప్తున్న సమయంలో ఆమె దగ్గరి నుంచి మైక్ తీసుకున్న అరవింద్ ముందుగానే అన్ని తెలిసినట్లుగా.. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లేడేస్తుంది. ఇక్కడే ఓ కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా.. అని లావణ్యను సరదాగా ఆట పట్టించారు. .
దీంతో లావణ్య కూడా నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అంటూ హింట్ ఇచ్చింది. ఇక లావణ్యకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ జరగడంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు సైతం అంటే మీకు ముందే తెలుసన్న మాట అని అరవింద్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేయటం మొదలుపెట్టారు .
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోవడానికి లావణ్య త్రిపాఠికి మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ ఏమిటంటే..?
జయలలిత కోసం శోభన్ బాబు ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!
అకస్మాత్తుగా మారుతున్న వాతావరణంతో ఎదుర్కొనే సమస్యలు ..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..?