Home » పరోక్షంగా మెగాస్టార్ పై సెటైర్లు వేసిన ఆలీ.. అంత మాటన్నారా..?

పరోక్షంగా మెగాస్టార్ పై సెటైర్లు వేసిన ఆలీ.. అంత మాటన్నారా..?

by Sravanthi Pandrala Pandrala

టాలీవుడ్ కి ఏమైంది.. వరుసగా ప్రముఖులంతా మరణిస్తున్నారు. గడచిన కొద్ది నెలల్లోనే కృష్ణంరాజు, కృష్ణ కైకాల సత్యనారాయణ, వంటి ప్రముఖ హీరోలు ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా మూడు దశాబ్దాలకు పైగా అగ్ర హీరోయిన్ గా అలరించిన జమున గారు కన్నుమూశారు. ఆమె మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా సోఖశాంద్రంలో మునిగిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సమయంలో మహానటి సావిత్రి తర్వాత రెండవ స్థానంలో ఉండేది జమున మాత్రమే. ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించింది.

ఆమె సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె మరణవార్త విన్న చిత్ర పరిశ్రమ మరియు రాజకీయ నేతలంతా సంతాపం ప్రకటించారు. జమున పార్టీవ దేహాన్ని చూసేందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్ ఆలీ మాట్లాడుతూ జమున మృతదేహాన్ని చూసేందుకు ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖులు హాజరు కాలేదన్నారు. కొంతకాలం నుంచి జమున విపరీతమైన క్యాన్సర్ తో బాధపడుతోంది. ఆ మహాతల్లి అనుకోకుండా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమె రాజమండ్రి ఎంపీగా కూడా గెలుపొందారు. జమున పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మూగమనసులు మూవీ అన్నారు.

ఆమె ఒక హీరోయిన్ గానే కాకుండా, నిర్మాతగా కూడా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి స్టార్ హీరోయిన్ చనిపోతే ఇండస్ట్రీలో పెద్దలుగా చెప్పుకునే ఒక్కరు కూడా ఇక్కడికి రాకపోవడం బాధాకరమన్నారు. బహుశా వారికి సమాచారం అందినట్టు లేదు. అందుకే రాలేకపోయారేమో అని సెటైర్లు వేశారు. అయితే ఈయన ఇండస్ట్రీ పెద్దలు అనడంతో చాలామంది చిరంజీవిని ఉద్దేశించే ఆలీ పరోక్షంగా కామెంట్స్ చేసి ఉంటారని నెటిజెన్లు అనుకుంటున్నారు. ఇందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంత ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో ఆలీ కామెంట్స్ వైరల్ గా మారాయి.

also read:

Visitors Are Also Reading