Home » సింహాద్రి సినిమాలో నటించిన హీరోయిన్ అంకిత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

సింహాద్రి సినిమాలో నటించిన హీరోయిన్ అంకిత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

by Anji
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్- దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన  బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో సింహాద్రి చిత్రం ఒకటి. మాస్ అండ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో భూమిక, అంకిత కథనాయకలుగా నటించారు. జూలై 9, 2003న విడుదలైన సింహాద్రి సినిమా అప్పట్లో సంచలనమే సృష్టించింది. దాదాపు రూ. 8.5 కోట్లతో నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ.26 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా.. ఈ మూవీలోని సాంగ్స్ కూడా ఎక్కువగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో భూమికతో పాటు.. హీరోయిన్ అంకిత కూడా తన నటనతో ఆకట్టుకుంది.ఈ సినిమాలోనే కాకుండా లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి  సినిమాల్లో నటించి మెప్పించింది అంకిత.  2009 వరకు వరుసగా సినిమాలు చేసిన అంకిత ఇక ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. చివరిసారిగా 2009లో వచ్చిన పోలీస్ అధికారి చిత్రంలో ఆమె కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది.. ఎక్కడుందో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Advertisement

 బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అంకిత. అప్పట్లో ఫేమస్ అయినటువంటి రస్నా యాడ్ లో కూడా నటించి మంచి పాపులర్ అయింది. ఆ తర్వాత పలు కమర్షియల్ ప్రకటనలలో  కూడా నటించింది. ఆ తర్వాత వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో వెండితెరకు కథానాయకగా పరిచయమైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆమెకు తెలుగులో భారీగానే అవకాశాలు లభించాయి. అదేవిధంగా ఎన్టీఆర్, జక్కన్న కాంబోలో వచ్చిన సింహాద్రిలోనూ నటించింది. 

Also Read :  రెబల్, మిరపకాయ్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Manam News

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు సినిమాలలో నటించి మెప్పించింది. అప్పట్లో అంకితకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది. అయితే వరుస హిట్స్ అందుకున్న ఆమె ఆ తర్వాత మెల్లగా ఫ్లాప్ ని కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో చాలా అవకాశాలు తగ్గాయి. కొన్నాళ్ల తర్వాత పూణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ ని పెళ్లి చేసుకుంది అంకిత. ఇక అనంతరం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె తన తండ్రికి సంబంధించిన వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటూ.. ఫ్యామిలీతో పుల్ బిజీగా తన జీవితాన్ని గడుపుతుంది.   ఇక అంకిత సోషల్ మీడియాలో కూడా చాలా సైలెంట్ గానే ఉంటుంది. 

Also Read :  “వాల్తేరు వీరయ్య” సినిమా విలన్ బాబీ సింహా భార్య ఎవరో తెలుసా..? వీళ్ళ లవ్ స్టోరీలో అదిరిపోయే ట్విస్ట్ లు…!

Visitors Are Also Reading