తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ పోలీస్ నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీస్ నియామక మండలి మార్పులు చేసింది. ఇటీవల తెలంగాణలో పోలీస్ విభాగం ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మార్చి 12, ఏప్రిల్ 23 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షల తేదీలను మార్చుతూ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన చేసింది.
సబ్ ఇన్స్పెక్టర్ (ఐటీ), అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షలు మార్చి 12 నుంచి మార్చి 11వ తేదీకి మార్చారు. అంటే ఒకరోజు ముందుకు జరిపారు. ఇక, కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటి) పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ మేరకు మార్పులు చేసింది.
Advertisement
Advertisement
క్లియర్ వివరాలు
ఎస్సై (ఐటీ) – మార్చి 12, 2023 నుంచి మార్చి 11, 2023 తేదీకి మార్పు.
ఫింగర్ ప్రింట్ బ్యూరో (ఏఎస్ఐ) – మార్చి 12, 2023 తేదీ నుంచి మార్చి 11, 2023 తేదీకి మార్పు.
కానిస్టేబుల్ – ఏప్రిల్ 23, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023వ తేదీకి మార్పు
కానిస్టేబుల్ (ఐటి) – ఏప్రిల్ 23, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023వ తేదీ కి మార్పు.
READ ALSO : ఏపీ నిరుద్యోగులకు జగన్ శుభవార్త..4,765 పోస్టుల భర్తీకి ఆదేశాలు