Home » అక్కినేని నాగార్జునకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారో తెలుసా…? వాళ్లంతా ఏం చేస్తున్నారంటే….!

అక్కినేని నాగార్జునకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారో తెలుసా…? వాళ్లంతా ఏం చేస్తున్నారంటే….!

by AJAY
Ad

తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో ఎంతో కృషి చేసిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఈయన చెన్నై నుండి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమను తరలించేందుకు ఎంతో కృషి చేశారు. హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో ని స్థాపించి ఇక్కడే సినిమా షూటింగ్ లు చేశారు. ఇక అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా నాగేశ్వరరావు గుర్తింపు తెచ్చుకున్నారు. నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి సంతానంలో నాగార్జున ఒక్కడే స్క్రీన్ పై మెరిసారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ నాగార్జునకు నలుగురు తోబుట్టువులు ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు. వారిలో ఒకరు సోదరుడు కాగా మరో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కానీ ఈ విషయం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. కాబట్టి నాగార్జున తోబుట్టువులు ఎవరు.. ఏం చేస్తున్నారు…. అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

నాగార్జున అన్నయ్య పేరు అక్కినేని వెంకట్. ఈయన అన్నపూర్ణ స్టూడియోస్ మేనేజర్ గా పనిచేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు ఎంతగానో కృషి చేశారు. అంతే కాకుండా నిర్మాతగా కూడా అక్కినేని వెంకట్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.

అక్కినేని ఫ్యామిలీ లో ఆడపిల్లల విషయానికి వస్తే నాగార్జున పెద్దక్క అక్కినేని సత్యవతి. ఈమె ఆలగడ్డ నాగేంద్ర ను వివాహం చేసుకుంది. వీరి కుమారుడే హీరో సుమంత్.

అక్కినేని నాగార్జున రెండో సిస్టర్ పేరు నాగ సుశీల…. వ్యాపారవేత్త అనుమోలు రంగారావు ను వివాహం చేసుకుంది. టాలీవుడ్ హీరో సుశాంత్ వీరి కుమారుడే. ఇక నాగార్జునకు మరో సోదరి అక్కినేని సరోజ కూడా ఉండేది. కానీ ఆమె చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందింది.

Visitors Are Also Reading