Home » బ్ర‌హ్మ‌నందంను బంగార్రాజులో ఎందుకు తీసుకోలేదో తెలుసా..?

బ్ర‌హ్మ‌నందంను బంగార్రాజులో ఎందుకు తీసుకోలేదో తెలుసా..?

by Anji
Ad

ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస ప్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న నాగార్జున తాజా చిత్ర‌మైన బంగార్రాజుతో పెద్ద విజ‌యాన్నే సాధించారు. ఈ విజ‌యం వెనుక నాగార్జున‌కు మ‌రింత జోష్ క‌లిగించింది. సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా ప‌డ‌డంతో బంగార్రాజు చిత్రానికి మంచిగా క‌లిసొచ్చింది. ఆరేండ్ల కింద‌ట విడుద‌లైన సొగ్గాడే చిన్నినాయ‌నా మూవీకి సీక్వెల్ గా బంగార్రాజు సినిమాపై అంచెనాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు వినోదం అందించ‌డంతో పాటు బాక్సాపీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది.

On Nagarjuna Akkineni's birthday, here are 5 of his unique movies |  Entertainment News,The Indian Express

Advertisement

Advertisement

గ‌త కొద్ది రోజులుగా సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొంటున్న నాగార్జున కొన్ని ఆస‌క్తికరమైన విష‌యాలను వెల్ల‌డించారు. సొగ్గాడే చిన్నినాయ‌నా క‌థ జ‌రిగిన 30 ఏండ్ల త‌రువాత క‌థ‌గా బంగార్రాజు చిత్రాన్ని చూపించాం అని పేర్కొన్నారు. తాత‌, మ‌న‌వ‌డి క‌థ‌.. 30 ఏళ్ల త‌రువాత జ‌రిగే క‌థ‌లో బ్ర‌హ్మ‌నందంను చూపిస్తే ఓ 80 ఏళ్ల వ‌య‌సు ఉన్న వ్య‌క్తిగా చూపించాల్సి వ‌స్తుంది. అదొక పెద్ద స్టోరీ అవుతుంది. అందుకే బ్ర‌హ్మ‌నందం పాత్ర‌ను పెట్ట‌లేదు అని చెప్పారు.

Will never stop entertaining audiences: Brahmanandam | Bollywood News –  India TV

సొగ్గాడే చిన్నినాయ‌నా సినిమాలో బ్ర‌హ్మ‌నందం ఆత్మ‌నంద‌స్వామిగా న‌టించి మెప్పించారు. బంగార్రాజులో నాగార్జున‌కు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టించారు. ఈ చిత్రం సొగ్గాడే చిన్నినాయ‌నా సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చింది. అన్న‌పూర్ణ స్టూడియో, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి న‌టించారు.

Visitors Are Also Reading