టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది హీరోయిన్ సమంత. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత విడాకులు ప్రకటించిన విషయ అందరికీ తెలిసిందే. నాగచైతన్యకు దూరంగా ఉంటున్నప్పటికీ అక్కినేని ఫ్యామిలీతో మాత్రం సమంత చాలా క్లోజ్ గానే ఉంటుందని తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన అఖిల్ సుమంత్ సినిమాలు కనుక విడుదలవుతుంటే సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు చెబుతుంటారు.
Also Read : ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేను…తారకరత్నభార్య ఎమోషనల్..!
Advertisement
అఖిల్ పుట్టిన రోజు సదర్భగా ఈమె గత ఏడాది కూడా శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా ఏడాది అఖిల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏప్రిల్ 8న అఖిల్ తన 29వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత తనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఏజెంట్ సినిమా ఫైర్ ఉండబోతుందని తెలియజేస్తూ.. తనకు విషెష్ తెలిపారు. సమంత అఖిల్ కి విషెష్ చెబుతూ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తూ.. చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
Advertisement
Also Read : రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పుడేనా?
సమంత అఖిల్ కి శుభాకాంక్షలు తెలిపినా అఖిల్ రిప్లై ఇస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. దీంతో అఖిల్ సమత తనకు శుభాకాంక్షలు తెలిపుతూ చేసినపోస్ట్ కి రిప్లై ఇచ్చారు. అఖిల్ రిప్లై ఇస్తూ.. థాంక్యూ సో మచ్ సామ్. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా అంటూ హార్ట్ సింబల్ షేర్ చేశారు. అఖిల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత పోస్ట్ కు అఖిల్ రిప్లై ఇవ్వడంతో ఈమెకు ఇంకా అక్కినేని వారితో మంచి అనుబంధం ఉందని నాగచైతన్యను మాత్రమే దూరం పెట్టిందని అందరూ భావిస్తున్నారు.