Home » గ్రామాల్లో అఖండ మేనియా….స్పెషల్ స్క్రీన్, డీజే లు పెట్టి షోలు…!

గ్రామాల్లో అఖండ మేనియా….స్పెషల్ స్క్రీన్, డీజే లు పెట్టి షోలు…!

by AJAY
Ad

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ నమోదయింది. ఈ సినిమా 50 రోజుల్లో 200 కోట్ల కలెక్షన్లను రాబట్టి బాలయ్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఈ చిత్రాన్ని రీసెంట్ గా ఓటీటీలో విడుదల చేయగా అక్కడ కూడా బాలయ్య జోరు కనిపిస్తోంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కూనంనేని వారి పాలెం లో ఈ సినిమా స్పెషల్ షో ను వేశారు.

Advertisement

అయితే ఈ షోను థియేటర్ లో కాకుండా ఊర్లోనే ఒక పెద్ద తెరపై ప్రదర్శించారు. గ్రామస్తులంతా ఒకే వద్ద కూర్చుని ఈ సినిమాను వీక్షించారు. పెద్ద పెద్ద డీజే బాక్సులు ఏర్పాటు చేసి అఖండ సిరిమాను ఉత్సవంలా జరుపుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఒకప్పుడు ఇదే విధంగా గ్రామాల్లో సినిమాలు ప్రదర్శించే వారని నెటిజన్లు అనుకుంటున్నారు.

Visitors Are Also Reading