Home » ఓటిటిలో దుమ్మురేపుతున్న అఖండ…బాలయ్య ఖాతాలో మరో అరుదైన రికార్డు…!

ఓటిటిలో దుమ్మురేపుతున్న అఖండ…బాలయ్య ఖాతాలో మరో అరుదైన రికార్డు…!

by AJAY
Ad

సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అఖండ. మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో అఖండ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా థియేటర్లలో సెన్సేషనల్ విజయం సాధించింది. 50 రోజుల్లో 200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రాన్ని జనవరి 21న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓటిటి లో విడుదల చేసిన ఈ సినిమా మొదటి రోజు హాయెస్ట్ అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్య ఖాతాలో ఇప్పుడు మరో రికార్డు నమోదయింది. తాజా సమాచారం ప్రకారం ఓటిటిలో మొదటి వారంలో ఎక్కువ వ్యూవ్స్ సాధించిన ఏకైక తెలుగు సినిమా గా అఖండ నిలిచింది.

Advertisement

దాంతో ఈ సినిమా హాట్ స్టార్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ వ్యూ వ్స్ సాధించడంతోపాటు ఎక్కువ రోజులు ట్రెండింగ్ లో ఉన్న సినిమాగా కూడా అఖండ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. జనవరి 22 నుండి 29 వరకు ఈ సినిమా హాట్ స్టార్ లో టాప్ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Visitors Are Also Reading