Telugu News » Blog » బాలీవుడ్ లో బాల‌య్య క్రేజ్…అఖండ కోసం పోటీప‌డుతున్న హీరోలు..!

బాలీవుడ్ లో బాల‌య్య క్రేజ్…అఖండ కోసం పోటీప‌డుతున్న హీరోలు..!

by AJAY
Ads

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అఖండ‌. ఈ సినిమాకు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో ప్ర‌గ్యా జైష్వాల్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ లో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా బాల‌య్య అగోరా పాత్ర ఈసినిమాకు హైలెట్ గా నిలిచింది. ఫ‌స్ట్ డే నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో పాటూ ఈ సినిమా కేవ‌లం 50 రోజుల్లో రెండు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.

Ads

Ads

బాల‌య్య కెరీర్ లోనే అత్య‌ధిక కలెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమాగా నిలిచిపోయింది. ఇదిలా ఉండ‌గా తెలుగు సినిమాల వెంట బాలీవుడ్ నిర్మాత‌లు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తెలుగులో సూప‌ర్ హిట్ గా నిలిచిన ప‌లు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు బాల‌య్య అఖండ రీమేక్ కోసం కూడా బాలీవుడ్ హీరోలు పోటీ ప‌డుతున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Balayya

Balayya akhanda movie 

ఈ సినిమా రీమేక్ హ‌క్కుల కోసం ప‌లువురు బాలీవుడ్ నిర్మాత‌లు పోటీ ప‌డుతుండ‌గా సినిమాలో న‌టించేందుకు అక్ష‌య్ కుమార్ మ‌రియు అజ‌య్ దేవ్ గ‌న్ లు పోటీప‌డుతున్న‌ట్టుగా బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రోవైపు అఖండ పాత్ర‌ను ఈ ఇద్ద‌రు హీరోలు కూడా చేయ‌గ‌లిగే స‌మ‌ర్థులే అని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి చివ‌ర‌కు ఈ సినిమా రీమేక్ చేసే అవ‌కాశం ఎవ‌రికి ద‌గ్గుతుందో చూడాలి.