ఐపీఎల్ 2023 లో ముంబై సంచలనం సృష్టించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో… స్టోయినిస్ 40 మినహా మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముంబై బౌలర్లలో మద్వాల్ ఐదు వికెట్లు, జోర్డాన్, పియూష్ చెరో వికెట్ తీశారు. లక్నోలో ముగ్గురు బాటర్లు రన్ అవుట్ అయ్యారు. ఈ విజయంతో ముంబై క్వాలిఫైయర్-2 లో గుజరాత్ తో తలపడనుంది.
Advertisement
ఓటమిపాలైన లక్నో ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది. కాగా, మొన్న గుజరాత్ పై గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. అయితే… మ్యాచ్ లో ముంబై గెలుపుకు ప్రదాన కారణం ఆకాష్ మద్వాల్. తన సంచలన బౌలింగ్ తో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో మద్వాల్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఆకాష్ 24 ఏళ్ల వయసు వచ్చేవరకు టెన్నిస్ బాల్, క్రికెట్ మాత్రమే ఆడటం విశేషం.
Advertisement
అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ కారణం. 2019లో ఉత్తరాఖండ్ తరపున ఆడుతున్న సమయంలో మద్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడు. ఇక ఐపీఎల్ 2023 కి ముందు నిర్వహించిన వేలంలో రూ. 20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన మద్వాల్ 13 వికెట్లు తీశాడు. పక్కింట్లోనే ఆకాష్ ఉండేది. వీళ్ళిద్దరూ అవతార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకున్నారు. పంత్ ఢిల్లీకి మారిపోతే…ఆకాష్ మాత్రం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోయాడు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Dimple Hayathi : ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి… కేసు నమోదు…
రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?