ఆస్ట్రేలియాలో ఈ నెలలో పార్రంభం కానున్న ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అయితే గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో కనీసం సెమీస్ కు కూడా చేరలేకపోయిన భారత జట్టు ఈ ఏడాది ఎలాగైనా టైటిల్ గెలవాలని అనుకుంటుంది. అందుకు తగ్గిన విధంగానే జట్టును కూడా ఎంపిక చేసారు సెలక్టర్లు. కానీ అందులో ఉన్న రిషబ్ పంత్ మాత్రం అందరిని నిరాశపరుస్తున్నాడు.
Advertisement
ఈ ప్రపంచ కప్ కోసం వెళ్ళడానికి కంటే ముందు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండు టీ20 సిరీస్ లలో కూడా పంత్ విఫలం అయ్యాడు. అందుకే అతడిని జట్టు నుండి తప్పించాలి అనే డిమాండ్ కూడా వస్తుంది. ఇలాంటి సమయంలో పంత్ ప్రపంచ కప్ విజయంలో ఏ పాత్రకు పనికిరాదు అని భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా అన్నాడు.
Advertisement
ఆయన తాజాగా మాట్లాడుతూ… ఇండియా ప్రపంచ కాపీ గెలవడానికి జట్టులో ఉన్న అందరికి తమ తమ లక్ష్యాలు అనేవి ఉన్నాయి. కానీ పంత్ కు మాత్రం ఏ లక్ష్యం.. ఏ పాత్ర అనేది లేదు. అందుకే అతనికి ఈ మధ్య అవకాశాలు అయితే రావడం లేదు. కానీ పాత్ర కు పోటీగా ఉన్నా దినేష్ కార్తీక్ మాత్రం అదరగొడుతున్నాడు. అందుకే పంత్ ఈగోను వదిలేసి కార్తీక్ వద్దకు వెళ్లి బ్యాటింగ్ టిప్స్ అనేది అడిగి తెలుసుకోవాలి అని జడేజా సూచించాడు.
ఇవి కూడా చదవండి :