Home » OTT లోకి వచ్చేసిన అహింస.. ఎందులో చూడొచ్చంటే..?

OTT లోకి వచ్చేసిన అహింస.. ఎందులో చూడొచ్చంటే..?

by Anji
Ad

ప్రస్తుతం రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. గతంలో ఒక సినిమా విడుదలైతే అది థియేటర్లలో విడుదలై దాదాపు 100, 150, 175 రోజులు పాటు నడిచేది. కానీ ప్రస్తుతం అంతా కమర్షియల్ అయిపోయింది. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ ఎంత వసూలు చేసింది అనే రికార్డు చూస్తున్నారు. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఓటీటీలో స్పందన ఎలా ఉందనే చూస్తున్నారు.తాజాగా  టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు హీరోగా నటించిన సినిమా అహింస. ఈ మూవీ జూన్ లో విడుదలైంది.

Advertisement

అయితే దాదాపు 6 నెలల తరువాత డిజిటల్ ప్లాట్ ఫాం పై స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే టీవీలోకి వచ్చేసింది.  ముఖ్యంగా భారీ క్యూరియాసిటి మధ్య ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిత్రం అంతగా మెప్పించకలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ విడుదలైన ఆరు నెలల తరువాత ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. కానీ రిలీజ్ మాత్రం చేయలేదు. సెప్టెంబర్ లో ఈ సినిమా టీవీల్లోకి వచ్చేసింది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం జరగలేదు.

కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 6 నెలల తరువాత ఓటీటీలో ప్రసారం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అహింస మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు.. పాన్ ఇండియా స్టార్ హీరో  రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ దగ్గుబాటి ఈ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. దర్శకుడు తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 02న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో అభిరామ్ జోడిగా.. గీతిక తివారి నటించగా.. ఆర్.పీ.పట్నాయక్ సంగీతం అందించారు.  

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading