Home » జనసేన కోసం రానున్న ‘ఆహా’ దిన పత్రిక… ఈ పత్రిక ధర ఎంతో తెలుసా!

జనసేన కోసం రానున్న ‘ఆహా’ దిన పత్రిక… ఈ పత్రిక ధర ఎంతో తెలుసా!

by Bunty
Ad

 

అల్లు అరవింద్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అల్లు అరవింద్ టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. అంతే కాకుండా అల్లు అరవింద్ సొంత స్టూడియో ను సైతం నిర్మించారు. ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య వారసుడు గా అల్లు అరవింద్ టాలీవుడ్ లో నిర్మాతగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే అల్లు రామలింగయ్య కమెడియన్ గా అభిమానులను సంపాదించుకుంటే అల్లు అరవింద్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు.

read also : అమలా టార్చర్ భరించలేకనే సమంత… నాగచైతన్యతో విడిపోయిందా…!

Advertisement

 

ఇక ఇటీవలే.. ఆహా ఓటీటీని తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు అల్లు అరవింద్. అయితే, ఇన్ని రోజులు కేవలం ఆన్లైన్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన ఆహా మీడియా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి గడప తొక్కనుంది. అసలు విషయానికి వస్తే జూలై 1వ తేదీ నుండి ఆహా దినపత్రిక అందుబాటులోకి రాబోతుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది ఆహా టీం.

Advertisement

read also : 1964 లో “అంబాసిడర్” కారు ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!

Aha' Dina Patrika: April Fool Prank?

ఈ దినపత్రికలో రాజకీయాలు, సినిమాలు, క్రీడలు, వ్యాపారం వంటి క్యాటగిరిలు మాత్రమే కాకుండా, రోజుకో ప్రముఖ టాప్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయని సమాచారం. ఈ దినపత్రిక ధర 5 రూపాయల వరకు ఉంటుందని వినికిడి. అయితే అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ కి బంధువు కాబట్టి జనసేన పార్టీకి ఈ దినపత్రిక బాగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశిస్తున్నారు. డిజిటల్ మీడియాలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన ఆహా మీడియా పత్రిక రంగంలో కూడా అదే రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తుందా లేదా అనేది తెలియాలంటే జూలై వరకు ఆగాల్సిందే.

read also : మాజీ సీఎం మనవడితో మళ్ళీ దొరికిన జాన్వి కపూర్… వీడియో వైరల్!

Visitors Are Also Reading