Home » దూకుడు మీదున్ననాగచైతన్య.. కారణం ఇదేనా..!!

దూకుడు మీదున్ననాగచైతన్య.. కారణం ఇదేనా..!!

Ad

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య గల సంవత్సరం విడుదలైన లవ్ స్టోరీ సినిమా తో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమాతో మరో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

అలాగే ఈ సినిమాతో పాటు హిందీలో లాల్ సింగ్ సిద్ధా సినిమాలు కూడా నాగచైతన్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించ బోతున్నారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో నటించ బోతున్నారు. అలాగే ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే విడుదలైంది. అలాగే డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే సినిమాలో కూడా నాగచైతన్య నటిస్తున్నాడు.

Advertisement

ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నాగ చైతన్య మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాకు డైరెక్టర్ గా పనిచేసిన పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినపడుతోంది. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగచైతన్య పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా పట్టాలేక్కబోతున్నట్లు సమాచారం. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతూ నాగచైతన్య తన సత్తా చాటుతున్నాడు.

ALSO READ;

మ‌హేష్‌బాబుకు షాక్‌.. సోష‌ల్ మీడియాలో స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్‌..!

గ్రూప్‌-1 పోస్టుల కేటాయింపుపై మీకు డౌట్ ఉంటే ఈ విష‌యాలు తెలుసుకోండి..!

 

Visitors Are Also Reading