Home » న‌రేష్‌ ప‌విత్రా లోకేష్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా… వీరి ప్రేమ‌కు బీజం ఎక్క‌డ ప‌డింది..!

న‌రేష్‌ ప‌విత్రా లోకేష్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా… వీరి ప్రేమ‌కు బీజం ఎక్క‌డ ప‌డింది..!

by AJAY
Ad

ప్రస్తుతం నరేష్ టాలీవుడ్ లో నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మా ఎన్నికల సమయంలో నరేష్ కీలకంగా వ్యవహరించారు. విష్ణు కు సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ప్యాన‌ల్ పై విమర్శలు కురిపించారు. చివరికి మంచు విష్ణు మా ఎన్నికల్లో విజయం సాధించారు. ఇదిలా ఉంటే నరేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో, మా ఎన్నిక‌ల్లో విజ‌యంతో జోష్ లో ఉన్న స‌మ‌యంలో టాలీవుడ్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా నరేష్ పవిత్ర లోకేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement

నరేష్ వయసు 60 ఏళ్లు దాటిపోగా ఇప్పటికే రెండుసార్లు పెళ్లై విడాకులు కూడా విడాకులు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా నటి పవిత్ర లోకేష్ కు కూడా కన్నడ నటుడు తో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే పవిత్ర లోకేష్ కొంత కాలంగా భర్తకు దూరంగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే న‌రేష్ ప‌విత్ర పెళ్లి వార్తలు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ ఆలయంలో పూజలు జరిపించారు.

Advertisement

దాంతో పెళ్లి కోసమే నరేష్ పవిత్రలు పూజలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక పెళ్లి వార్తలపై నరేష్ స్పందించినప్పటికీ పవిత్ర లోకేష్ తో పెళ్లిని మాత్రం నేరుగా ఖండించకుండా పెళ్లి పై వివాహ వ్య‌వ‌స్థ పై ఆసక్తికర కామెంట్లను చేశారు. కానీ పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకుంటున్నారా…. లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక నటి పవిత్ర లోకేష్ సైతం వార్త‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నా ఒకసారి కూడా స్పందించలేదు.

ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అన్న విషయం పక్కన పెడితే నరేష్ వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలు కాగా పవిత్ర లోకేష్ వయసు 43 సంవత్సరాలు. వీరిద్దరి మధ్య 19 సంవత్సరాల వ‌య‌సు తేడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నరేష్ పవిత్ర కలిసి దాదాపు పది చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమకు బీజం పడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నుండి ఇద్ద‌రూ క‌లిసే ఉంటున్నార‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

Visitors Are Also Reading