అడవులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు ఎరుపు ఎక్కాయి. పచ్చని ఆకులతో హరిత వర్ణ శోభతో అలరారే ఆదిలాబాద్ అడవులు ఎరుపెక్కడం ఏమిటని ఆలోచిస్తున్నారా..? ఇది వాస్తవమే అడవులు ఎరుపెక్కాయి. ఎలా అంటే ఆకులన్ని రాలిపోయి బోసిపోతున్న అడవులలో మోదుగుపూలు విరబూసి కొత్త అందాలను అద్దుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయిన అడవికి కొత్త సాయాగాన్ని అందిస్తున్నాయి. ఎండాకాలానికి ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో అటవీ ప్రాంతాలు మోదుగ పూలతో ఆకర్షణీయంగా మారుతాయి. ప్రకృతి ప్రసాదించిన పువ్వులతో ఈ మోదుగుపూలు విశిష్టమైన ఎరుపు రంగులతో కూడుకుని చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఏ గ్రామానికి వెళ్లినా ఎరుపు వర్ణంతో మోదుగ పూలచెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇక హోలీ పండుగ సమయంలో అందుబాటులో ఉండే మోదుగ పూలనే రంగులుగా తయారు చేసి వేడుకలు జరుపుకునే సంప్రదాయం మన సొంతం. ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా నిర్వహించే హోలీ పండుగకు సంప్రదాయం మన సొంతం. ఫాల్గుణ మాస పౌర్ణమి సదర్భంగా నిర్వహించే హోలీ పండుగకు సంప్రదాయ మోదుగపూల రంగులనే ఉపయోగించడం ఆనవాయితీ. పండగకు ముందే నారింజ రంగుతో కూడిన ఎర్రని పూలను సేకరించి అందులోని పుప్పొడితో సహజ రంగులను తయారు చేసేవారు. ఆరోగ్యానికి ఏమాత్రం హానీ చేయని మోదుగ పూల రంగులతోనే హోలీ వేడుకలు జరుపుకునేవారు.
Advertisement
Advertisement
ఇదిలా ఉంటే మోదుగ పూలకు ఆయుర్వేద వైద్యంలో ప్రాధాన్యత ఉంది. పలు ఔషద గుణాలు కలిగి ఉన్న ఈ మోదుగ పూలను వైద్యానికి కూడా ఉపయోగిస్తారు. మరొక వైపు సాహిత్యంలో కూడా మోదుగ పూల ప్రస్తావన ఉన్నది. ప్రముఖ రచయిత, స్వాతంత్ర సమరయోధుడు ఈ మోదుగపూలు పేరుతో నవలను కూడా రాసారు. నాటి నిజాం ఏలుబడిలో తెలంగాణ ప్రజల స్థితిగతులు, బానిస పద్దతులను తెలంగాణలో జరిగిన ప్రజాపోరాటాన్ని ఈ నవలలో చిత్రించారు. ఆ తరువాత ఈ నవలను నాటకంగా కూడా ప్రదర్శించారు. ఈ వేసవిలో పసుపు వర్ణంలో విరగబూసే రేల పూలు కూడా ఆదిలాబాద్ జిల్లా అడవులకు కొత్త అందాలను తెచ్చిపెడుతున్నాయి. ఎర్రని మోదుగ పూలు, పచ్చని రేల పూలు ఆదిలాబాద్ అడవులకు పసుపు కుంకుమను అద్దినట్టు కనిపిస్తూ చూపరులను పరవశులను చేస్తాయి.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో ‘ఎన్టీవీ’