Home » తెలుగు రాష్ట్రాల్లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ‘ఎన్టీవీ’

తెలుగు రాష్ట్రాల్లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ‘ఎన్టీవీ’

by Anji
Ad

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం మీడియా ఛానెల్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ఛాన‌ల్స్ పెరిగినా కానీ.. ఎన్టీవీ ఛానెల్ ఓ ప్ర‌త్యేక‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌జాహిత‌మే ల‌క్ష్యంగా 24 గంట‌ల వార్తా ప్ర‌సారాల‌తో మొద‌లైన ఎన్టీవీ ఎప్ప‌టిక‌ప్పుడూ వాస్త‌వ వార్త‌ల‌ను మాత్ర‌మే ప్ర‌సారం చేస్తూ.. ఛానెల్ ప్రారంభించిన నాటి నుంచే ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందింది. మూరుమూల గ్రామం నుంచి రాష్ట్ర రాజ‌ధానుల వ‌ర‌కు క‌చ్చిత‌మైన వార్త‌లు అంటే ఎన్టీవీ అనేంత‌గా ప్ర‌జాద‌ర‌ణ పొందింది.


ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు లైవ్‌లో ఉండి రిపోర్టు చేయ‌డం, క‌చ్చిత‌మైన స‌ర్వేల‌కు ఎన్టీవీ పెట్టింది పేరు. వార్త‌లు అంటే కేవ‌లం త‌ప్పుడు ప్ర‌చారాలు, అన‌వ‌స‌ర‌మైన సంచల‌నాలు కాదు. నిజాన్ని నిర్భ‌యంగా, ధైర్యంగా చెప్ప‌గ‌ల‌గ‌డం ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన విష‌యాల‌ను వారి వ‌ద్ద‌కు చేర్చ‌డ‌మ‌ని న‌మ్మిన ఎన్టీవీకి ప్ర‌జ‌లు నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని క‌ట్ట‌బెట్టారు. గ‌త కొంత కాలంగా బార్క్ రేటింగ్స్ ఆపేసిన విష‌యం తెలిసిన‌దే.  రేటింగ్స్ ఆపివేయ‌క ముందు కూడా ఎన్టీవీ నెంబ‌ర్ వ‌న్ స్థానంలోనే కొన‌సాగింది.

Advertisement

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశివారు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు

Advertisement

తాజాగా వెల్ల‌డైన బార్క్ రేటింగ్స్ ప్ర‌కారం.. ఎన్టీవీ 73.8 టీఆర్పీల‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది. ‘ప్ర‌తిక్ష‌ణం-ప్ర‌జాహితం’ అనే స్లోగ‌న్‌ను వ‌దిలివేయ‌కుండా నిత్యం అదే మాట‌ మీద‌నే ఉండ‌డంతో ఎన్టీవీ ఈ స్థానానికి రావ‌డానికి ఓ కార‌ణం. దేనికి కూడా బెద‌ర‌కుండా.. ఎవ‌రినీ బెదిరించ‌కుండా ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డుతుండ‌డ‌మే ఎన్టీవీ తెలుగు మీడియా రంగంలో మేటిగా కొన‌సాగుతోంది.


ఎన్టీవీ నెంబ‌ర్ వ‌న్ గా నిల‌వ‌డంపై ఎన్టీవీ, ర‌చ‌నా గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రి, మేనేజింగ్ డైరెక్ట‌ర్ ర‌మాదేవి సంతోషం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ఎన్టీవీని నెంబ‌ర్ వ‌న్‌  స్థానంలో ఉంచ‌డంలో భాగ‌మైన ప్ర‌తీ ఒక్కరినీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందు ముందు మ‌రిన్నీ విజ‌యాల‌ను అందుకోవాల‌ని, ప్ర‌తిక్ష‌ణం ప్ర‌జాహితం అనే స్లోగ‌న్ మ‌న‌సులో పెట్టుకుని సేవ చేయాల‌ని సిబ్బందికి సూచించారు. ప్ర‌జ‌లు ఇచ్చిన ఈ గౌర‌వం త‌మ‌పై మ‌రింత బాధ్య‌త‌ను పెంచింద‌ని, ఈ గౌర‌వాన్ని అందించిన  ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Also Read :  ఆ నిర్మాత వ‌ల్ల ఆరు నెల‌లు అద్దం చూసుకోలేదు…విద్యాబాల‌న్ ఎమోష‌న‌ల్…!

Visitors Are Also Reading