Home » పెరుగులో తేనె కలుపుకొని తింటే ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు !

పెరుగులో తేనె కలుపుకొని తింటే ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు !

by Anji
Ad

పెరుగులో కొందరూ పంచదార కలిపి తీసుకుంటే.. మరికొందరూ ఉప్పు, కారం కలిపి తింటుంటారు. పెరుగులో ఎవరైనా తేనె కలిపి తింటే మాత్రం దాని నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంది. తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. హార్వార్డ్ హెల్త్ ప్రకారం.. తేనెలో 17 శాతం నీరు, 31 శాతం గ్లూకోజ్, 38 శాతం ఫ్రక్టోజ్ ఉంటాయి. దీంతో పాటు జింక్, మాంగనీస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక టీ స్పూన్ తేనెలో 64 క్యాలరీలు, 17.0 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని తెలిపారు. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్  హెల్త్ ప్రకారం.. పెరుగు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగులో ప్రోటిన్, కాల్షియం, ప్రోబయోటిక్స్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లకు చాలా మంచి మూలంగా ఉంటుంది. పెరుగును తేనెతో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  ఇలాంటి వారితో అమ్మాయిలు చాట్ చేశారంటే… అంతే సంగతులు !

Advertisement

ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయడంలో ప్రోటీన్ శాఖహార మూలాల్లో పెరుగు ఒకటి అని అందరికీ తెలుసు. వ్యాయామం చేసే వారు వ్యాయామానికి ముందు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ల ఆహారాన్ని తినాలని సూచించారు. పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. తేనెలో అధిక మొత్తంలో గ్లూకోజ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగులో తేనె కలిపి తింటే చాలా మేలు జరుగుతుంది. వ్యాయామం తరువాత కూడా తినవచ్చు. ఇది కండరాల పునరుద్ధరణలో సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ కి మంచి మూలం. తేనె, పెరుగు రెండు ప్రోబయోటిక్స్ లో పుష్కలంగా ఉంటుంది. ప్రాథమికంగా బ్యాక్టీరియా, ఈస్ట్ ని కలిగి ఉన్నాయి. జీర్ణక్రియలో సహాయపడుతాయి. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రతీ ఒక్కరూ వేసవిలో పెరుగు తినాలని నిపుణులు సూచిస్తుంటారు. పెరుగును ఆహారంతో పాటు లేదా అల్పాహారంలో తీసుకోవచ్చు. ఎముకలను బలపరచడంలో పెరుగులో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రెండు పోషకాలు కలిసి ఎముకలను దృఢ పరుచుతాయి. ఎముకల నొప్పులు ఉన్నవారు పెరుగు, తేనె తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. 

Advertisement

Also Read :  ఆ స‌మ‌స్య‌లే చ‌దివించాయి ఆమెను క‌లెక్ట‌ర్ ను చేశాయి…ఐఏఎస్ వేదితారెడ్డి స‌క్సెస్ స్టోరీ..!

రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా విటమిన్ సీ, పెరుగు, తేనెలో లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.  కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి ఉన్న ఆహారాన్ని తినాలని సలహా ఇచ్చారని మనకు తెలిసిందే. జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో వేసవి కాలంలో ప్రజలు తరుచుగా జీర్ణక్రియ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రజలు తేలికపాటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతారు. ఎవరైనా వేసవిలో ప్రతీ రోజూ ఏదో ఒక రూపంలో పెరుగు తీసుకుంటే.. అతనికి పొట్ట సంబంధిత సమస్యలుండవు. జీర్ణక్రియ కూడా సంపూర్ణంగా ఉంటుంది. భోజనంలో ప్రతీ రోజూ ఒక గిన్నె పెరుగు తినాలని లేదా ఒక గ్లాస్ లస్సీని తీసుకుంటే చాలా మంచిది. వ్యాధుల నుంచి రక్షించేందుకు పెరుగు, తేనె కలిపి తీసుకుంటే జబ్బులు నయమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో రక్తం గడ్డ కట్టడం, బోలు ఎముల వ్యాధి, అతిసారం, ఊబకాయం, కీళ్ల నొప్పులు, గుండె, రక్త సంబంధిత వ్యాధులున్నాయి. 

Also Read :  మూల నక్షత్రం గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది ?

Visitors Are Also Reading