ఆమె వెండి తెరకు పరిచయమైన సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సహజ నటనతో ఫ్యామిలీ హీరోయిన్ గా మారింది. ఆమె మరెవ్వరో నటి స్నేహ. స్నేహగా సినిమాల్లో పేరు సంపాదించినప్పటికీ ఆమె అసలు పేరు సుహాసిని. వీరి కుటుంబం తాతల కాలంలో నుంచి రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి. స్నేహకు ఒక సోదరి సంగీత, సోదరులు బాలాజీ, గోవింద్ కలరు. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఆ తరువాత మెల్లమెల్లగా అవకాశాలను దక్కించుకుని సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది.
Also Read :
Advertisement
ఎన్టీఆర్ తో సహా టాలీవుడ్ లో శ్రీకృష్ణుడిగా నటించిన హీరోలు వీళ్లే..!
ముఖ్యంగా ఆమె సినిమాల్లో ఎక్కడ కూడా గ్లామర్ షో కి తావు లేకుండా ఎంతో సంప్రదాయంగా నటిస్తూ అందరి మన్ననలు పొంది ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో ఓ అగ్రతారగా కొనసాగుతున్న తరుణంలోనే తమిళ నటుడు ప్రసన్నకుమార్‌ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తరువాత వెండితెరకు కొన్నాళ్లపాటు దూరమయ్యారు. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తున్నారు స్నేహ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న స్నేహ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు.
Advertisement
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి
ఇటీవల తన తండ్రి పుట్టిన రోజు వేడుక, తన కొడుకు విహాన్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు స్నేహ. ఈ ఫోటోలను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్నేహ తన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. ఈ తరుణంలో పలువురు అతిథులతో పాటు సీనియర్ హీరోయిన్ అయినా రంభ, శ్రీదేవి, విజయ్ కుమార్ వంటి నటీమణులను కూడా పూజకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న హీరోయిన్లతో కలిసి స్నేహ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్నేహ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read :
చాహల్, ధనశ్రీ వార్తలో వరుస ట్విస్టులు..!