Telugu News » Blog » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి

by Anji
Ads

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 19.08.2022: మేషం

అనుకోని లాభాలు వ‌స్తాయి. చాలా కాలం నుండి ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. ఇంట్లో, బ‌య‌ట మీ ప‌రిస్థితి సంతృప్తిక‌రంగా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మ‌హిళ‌ల‌కు కొత్త అవ‌కాశాలు వ‌స్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ఈరోజు మీరు కొంచెం క‌ష్ట‌ప‌డాల్సిన రోజు. శ్ర‌మ‌తో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఆదాయం కోసం బాగా శ్ర‌మించాలి. ఖ‌ర్చులు నియంత్రించుకోవాల్సిన రోజు. ఇరుగు, పొరుగు వారితో అనుకోని వివాదాలు రావ‌చ్చు. మంచి చేద్దామ‌నుకున్న చెడుగా మారే రోజు వ‌స్తుంది జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu: మిథునం

ఈరోజు అన్నింటా చ‌క్క‌ని శుభ‌దాయ‌క‌మైన ఫ‌లితాలు సాధిస్తారు. అప్పులు తీరుస్తారు. అనుకోని వారి నుంచి మాట ల‌బ్ది పొందుతారు. కుటుంబంలో శుభ‌కార్యాల‌పై చ‌ర్చ‌లు. మ‌హిళ‌ల‌కు ధ‌న‌ల‌బ్ధి చూకూరుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

కొత్త ప‌నులు ప్రారంభించుకుంటారు. ఆదాయం త‌క్కువ‌గా ఉంటుంది. వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్ర‌మించాల్సిన రోజు. ఆధ్యాత్మిక ఆలోచ‌న‌లు చేస్తారు. మ‌హిళ‌ల‌కు ప‌ని భారం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : సింహం

చాలా కాలంగా ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి. ధ‌నాన్ని పొదుపు చేస్తారు. అప్పుల‌ను తీర్చుతారు. కుటుంబంలో మార్పులు జ‌రుగుతాయి. విదేశీ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి. మ‌హిళ‌ల‌కు స్వ‌ర్ణ‌లాభాలు అమ్మ‌వారి ఆరాధ‌న చేయండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శ్ర‌మ‌తో కూడిన ఆదాయం కోసం కొత్త మార్గాల‌ను అన్వేశిస్తారు. ఇరుగు, పొరుగు వారితో ఇబ్బందులు రావ‌చ్చు. విలువైన వ‌స్తువుల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోండి. మాన‌సిక ఇబ్బంది వ్యాపారాల్లో చిక్కులు ఎదుర‌వుతాయి.

Today rashi phalau in telugu : తుల

అమ్మ‌నాన్న‌ల ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోండి. ఆదాయం కోసం క‌ష్ట‌ప‌డాల్సిన రోజు. పెద్ద‌ల నుంచి మంచి స‌ల‌హాలు తీసుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. వ్యాపారాల్లో ఉమ్మ‌డి వ్యాపారాల‌కు ఇబ్బంది క‌లుగుతుంది. స్త్రీల‌కు దూర ప్ర‌యాణ సూచ‌న క‌నిపిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శ్ర‌వ‌ణంతో ఈరోజు ప్రారంభ‌మ‌వుతుంది. ఇవాళ మీరు విదేశాల నుంచి శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహ‌క‌రంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

అప్పుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. కుటుంబంలో అశాంతి, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఆఫీస్‌లో అద‌న‌పు బాధ్య‌త‌లుంటాయి. మ‌హిళ‌ల‌కు మాట ప‌ట్టింపులు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

శుభ‌వార్త వింటారు. వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి. అన్నింటా మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థుల‌కు శుభ‌వార్త‌లు. ఆక‌స్మిక ప్ర‌యాణాలు, వ్యాపారాల్లో లాభాలు వ‌స్తాయి. ఆదాయం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

మీరు చేసే ప‌నుల్లో పురోగ‌తి క‌నిపిస్తుంది. ఆర్థికంగా లాభాలు వ‌స్తాయి. అన్నింటా మీరు శుభ‌దాయ‌క‌మైన రోజు. దూర ప్ర‌యాణాలు చేస్తారు. వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలు సంద‌ర్శిస్తారు.

Today rashi phalau in telugu :  మీనం

Advertisement

ఈరోజు పెండింగ్‌లో ఉన్న పనుల‌ను పూర్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అన్నింటిలో శ్ర‌మ‌తో కూడిన మంచి ఫ‌లితాలు సాధిస్తారు. విద్య‌, ఉద్యోగ విష‌యాల్లో సానుకూల‌మైన ఫ‌లితాలు ఆర్థిక పురోగ‌తి క‌నిపిస్తుంది.