Telugu News » Blog » క్యాన్స‌ర్ భారిన‌ప‌డ్డ న‌టి హంస నందిని…త్వ‌ర‌లోనే జ‌యిస్తానంటూ ఎమోష‌న‌ల్..!

క్యాన్స‌ర్ భారిన‌ప‌డ్డ న‌టి హంస నందిని…త్వ‌ర‌లోనే జ‌యిస్తానంటూ ఎమోష‌న‌ల్..!

by AJAY
Ads

టాలీవుడ్ న‌టి హంస నందిని లౌక్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు పరిచ‌యం అయ్యింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈగ సినిమాలో ఎంట్రీ సీన్ తో ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ త‌ర‌వాత వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ బిజీగా మారింది. అత్తారింటికి దారేది సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌క్క‌న స్టెప్పులు వేసి ఆక‌ట్టుకుంది. త‌నపేరుకు త‌గ్గ‌ట్టుగా హంస‌లాంటి అందంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. దాంతో యువ‌త ఈ మ‌త్తు కండ్ల సుంద‌రి అంటే ఎంతో అభిమానించ‌డం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా హంస నందిని ఓ చేదు వార్తను చెప్పింది. తాను క్యాన్సర్ భారిన ప‌డిన‌ట్టు హంస నందిని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.

Advertisement

hamsanandhini

hamsanandhini

ఒక‌రోజు త‌నకు చిన్న క‌ణితి అయ్యింద‌ని వెంట‌నే ఆస్ప‌త్రికి వెళ్లి టెస్ట్ లు చేయించుకుంటే అది బ్రెస్ట్ క్యాన్స‌ర్ గా నిర్ధార‌ణ అయ్యిందని వెల్ల‌డించింది. ఆ త‌ర‌వాత డాక్ట‌ర్ లు అది శ‌రీరంలో పూర్తిస్థాయిలో స్ప్రెడ్ అవ్వ‌లేద‌ని చెప్పిన‌ట్టు తెలిపింది. కానీ అది జ‌న‌టిక‌ల్ గా వ‌చ్చిన క్యాన్సర్ అని మళ్లీ త‌న‌కు బ్రెస్ట్ క్యాన్స‌ర్ వచ్చేందుకు 75శాతం అవ‌కాశాలు ఉన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌కు ఏడు సార్లు కీమోథెర‌పీ జ‌రిగింద‌ని మ‌రి కొన్ని రౌండ్లు కీమో థెర‌పీ చేయించుకోవాల్సి ఉంద‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం తాను చికిత్స తీసుకుంటున్న‌ట్టు హంస నందిని వెళ్ల‌డించింది.

Advertisement

also read: బిగ్ బాస్ ద్వారా స‌న్నీ ఎంత గెలుచుకున్నాడు..ఎంత సంపాదించాడు..?

స‌రిగ్గా ప‌ద్దెనిమిదేళ్ల క్రితం త‌న తల్లి అనారోగ్యంతో మ‌ర‌ణించింద‌ని ఆదేద‌న వ్య‌క్తం చేసింది. తాను క‌చ్చితంగా క్యాన్స‌ర్ ను జ‌యిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేసింది. క్యాన్స‌ర్ కు తాను భ‌య‌ప‌డ‌న‌ని ఈ వాధికి తాను బంధీని కాద‌ని చెప్పింది. తాను ధైర్యంతో క్యాన్స‌ర్ ను జ‌యిస్తాన‌ని త్వ‌ర‌లోనే కోలుకుని చ‌దువుకోవాల‌నుకునే విద్యార్థుల‌కు సాయం చేస్తాన‌ని చెప్పుకొచ్చింది. ఇక హంస నందిని చేసిన పోస్టుకు ఆమె అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రు హంస‌కు ధైర్యం చెబుతున్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది సెల‌బ్రెటీలు క్యాన్స‌ర్ జ‌యించారు. ఇప్పుడు హంస నందిని కూడా క్యాన్స‌ర ను జ‌యించి మన ముందుకు తిరిగి రావాల‌ని కోరుకుందాం.