Home » బిగ్ బాస్ ద్వారా స‌న్నీ ఎంత గెలుచుకున్నాడు..ఎంత సంపాదించాడు..?

బిగ్ బాస్ ద్వారా స‌న్నీ ఎంత గెలుచుకున్నాడు..ఎంత సంపాదించాడు..?

by AJAY

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలేను నిర్వాహ‌కులు చాలా గ్రాండ్ గా నిర్వ‌హించారు. వీడియో జాకీగా సీరియ‌ల్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన స‌న్నీ విన్న‌ర్ గా నిలిచాడు.

యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్ ర‌న్న‌ర్ గా నిలిచాడు. అంతే కాకుండా ఇండియ‌న్ ఐడ‌ల్ గెలుచుకుని ఎన్నో అంచనాల మ‌ధ్య హౌస్ లోకి అడుగుపెట్టిన శ్రీరామ‌చంద్ర మూడో స్థానానికి ప‌రిమితం అయ్యాడు. ఇక నాలుగో స్థానంలో మాన‌స్, ఐదో స్థానంలో సిరి హ‌న్మంత్ నిలిచారు.

vj sunny

vj sunny

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజ‌న్ 5 లో మందు నుండి ఎంటర్టైన‌ర్ గా పేరుతెచ్చుకుని టైటిల్ ను గెలుచుకున్న స‌న్నీ బిగ్ బాస్ ద్వారా ఎంత సంపాదించాడు…టైటిల్ విజేత‌గా నిలిచి ఎంత గెలుచుకున్నాడు అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే గ‌త సీజ‌న్ల విన్న‌ర్ ల‌తో పోలిస్తే సన్నీ అంద‌రికంటే ఎక్కువగా లాభం పొందాడు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన స‌న్నీకి యాజ‌మాన్యం రూ.50ల‌క్షల ఫ్రైజ్ మ‌నీని ముట్ట‌జెప్పింది. అంతే కాకుండా స‌న్నీకి బిగ్ బాస్ యాజ‌మాన్యం వారానికి రూ.2ల‌క్ష‌లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. స‌న్నీ మొత్తం 15వారాల పాటూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. కాబ‌ట్టి వారానికి రెండు ల‌క్ష‌ల చొప్పున 30ల‌క్ష‌లు గెలుచుకున్న‌ట్టు తెలుస్తోంది.

also read : రెండు నెలల్లో బిగ్ బాస్ సీజన్-6 షురూ…ప్రూఫ్ ఇదే…!

అదే విధంగా బిగ్ బాస్ లో సువ‌ర్ణ‌భూమి త‌ర‌పున వ‌చ్చిన రూ.25ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని కూడా స‌న్నీ గెలుచుకున్నాడు. వాటితో పాటూ స‌న్నీ అపాచీ స్పోర్ట్స్ బైక్ ను కూడా గెలుచుకున్నాడు. అయితే విన్న‌ర్ గా గెలుచుకున్న ప్రైజ్ మనీ నుండి 31.2 శాతం ఆదాయ‌ప‌న్ను మిన‌హాయిస్తే చేతికి 34.40ల‌క్ష‌లు చేతికి వ‌స్తాయి. అలా మొత్తంగా చూసుకుంటే బిగ్ బాస్ సీజ‌న్ 5 విజేత‌గా నిలిచిన స‌న్నీ రూ.1 కోటి 8ల‌క్ష‌ల వ‌ర‌కూ సంపాదించాడు. ఇక స‌న్నీ విజేత అవ్వ‌డంతో ఆయ‌న అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

Visitors Are Also Reading