Home » అందుకే విడాకులను కూడా ఫోటో షూట్ చేసుకున్న… నటి కన్నీటి కథ..!

అందుకే విడాకులను కూడా ఫోటో షూట్ చేసుకున్న… నటి కన్నీటి కథ..!

by AJAY
Ad

ఈ మధ్యకాలంలో సినీ తారలు పుట్టిన రోజు … పెళ్లి రోజు … ప్రేమికుల రోజు అంటూ ప్రతి రోజును తమదైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే ఆ రోజుకు తగ్గట్టు ఫోటోషూట్ ను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ తమ ఫాలోవర్స్ ను పెంచుకోవడం మాత్రమే కాకుండా తమ అభిమానులతో కూడా టచ్ లో ఉంటున్నారు. ఇలా పెళ్లి రోజు … పుట్టిన రోజు … ప్రేమికుల రోజు అంటూ ఫోటోషూట్లను నిర్వహిస్తూ ఉండే సినీ తారలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.

Advertisement

Advertisement

కాకపోతే తమిళ బుల్లితెర నటి శాలిని మాత్రం చాలా వినూత్నంగా విడాకుల ఫోటోషూట్ ను నిర్వహించింది. అలాగే ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇంత బాధాకరమైన విడాకులను ఫోటోషూట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేయడానికి గల కారణాలను ఈ నటి తాజాగా చెప్పుకొచ్చింది. ఈ నటి తాజాగా ఈ ఫోటోషూట్ పబ్లిసిటీ కోసం కాదు అని తన లాంటి మహిళలకు ఎందరికో మెసేజ్ గా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నట్లు తెలియజేసింది. దుబాయ్ లో నా భర్త కొట్టినప్పుడు వెళ్లి పార్కులో పడుకునే దాన్ని అని … అలా పార్కులో పడుకోవడానికి కారణం ఆ గొడవను మరింత పెద్దది చేసే ఉద్దేశం లేకపోవడమే అని తెలియజేసింది.

ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్దామా అనుకున్నప్పటికీ అతడి జీవితం నాశనం అవుతుంది అని మళ్ళీ వెనక్కు అడుగు వేసేదాన్ని.  2019 వ సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల పాటు అతడితో దెబ్బలు తింటూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు నా కూతురు గురించి ఆలోచించి మర్యాద ఇస్తూ వచ్చాను. ఆ పాప ముందే ఆమె ఏడుస్తుండగానే రాక్షసుడులా నన్ను కొట్టావు ఇకపై తనకు నీలాంటి తండ్రి అవసరం లేదు అని నిర్ణయించుకున్నాను అని నటి చెప్పుకొచ్చింది.

Visitors Are Also Reading