Home » వందకు పైగా సినిమాలు చేసిన అశ్వినీ.. అనాథలా చనిపోవడానికి కారణం ఏమిటి..?

వందకు పైగా సినిమాలు చేసిన అశ్వినీ.. అనాథలా చనిపోవడానికి కారణం ఏమిటి..?

by Sravya
Ad

చాలామంది సినిమాల మీద ఇష్టంతో ట్యాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే గుర్తింపు తెచ్చుకుంటారు. కొంతమంది సినిమాల్లో నటిస్తూ ఉన్నా కూడా అంతగా గుర్తింపు రాదు. తర్వాత అవకాశాలు కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కొంతమంది కథ అయితే ఇంకొంతమంది నటులు ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయిన కూడా చిరకాలం అభిమానులు గుండెల్లో నిలిచిపోతూ ఉంటారు. తక్కువ సినిమాలు చేసిన కూడా నటనతో అందరినీ ఆకట్టుకుని ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ ఆ స్థానాన్ని కోల్పోకుండా ఉంటారు.

అలాంటి వాళ్ళలో అశ్విని కూడా ఒకరు టాలీవుడ్ టాప్ హీరోల పక్కన నటించారు ఈమె 90 లలో తెలుగులో నటించడం మానేసి తమిళ సినిమాలకే పరిమితమైపోయారు. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ నటి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తర్వాత హీరోయిన్ గా మారారు. సుమారు 100 కి పైగా సినిమాల్లో నటించారు రూపాయి కూడా వెనకేసుకోలేదు. చివరికి అనాధలా చనిపోయారు అశ్విని చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి ఇంకో స్టార్ నటుడు సహాయం చేయాల్సి వచ్చింది. ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు కానీ చివరికి ఘోరమైన స్థితిలో మరణించింది. ఈమె ఇంటర్ చదువుతుండగానే ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా హిట్ అవ్వడంతో మలయాళం తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. చాలా సినిమాల్లో నటించారు నిజానికి 100 కి పైగా సినిమాల్లో ఈమె నటించారు.

Advertisement

Advertisement

Also read:

Also read:

ఆమె కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ రచయిత పువియరుసు మనవడితో రహస్యంగా పెళ్లి జరిగింది భర్త ఆమెని మోసం చేశాడని తెలిసింది అది ఆమె తట్టుకోలేకపోయింది. ఒక బిడ్డను దత్తత తీసుకొని పెంచుకుంది భర్త మోసం చేశాడని తట్టుకోలేని అశ్విని మానసికంగా కృంగిపోయింది తర్వాత నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గాయి పేరుకు పెద్ద హీరోయిన్ కానీ ఆస్తులు మాత్రం కూడబెట్టలేదు. చెన్నైలోకి ఇల్లు మాత్రమే ఉండేదట చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో ఇల్లు అమ్మేసి అర్ధ ఇంట్లో ఉన్నారట. 2012లో అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయింది 45 ఏళ్లకే అమీ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది ఆమె చనిపోయినప్పుడు స్వగృమానికి తీసుకు వెళ్లడానికి డబ్బులు లేకపోతే తమిళ హీరో పార్ధిబన్ సహాయం అందించారు ఇంత పెద్ద తార అనాధల వెళ్ళిపోయింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading