Home » “కార్తీక‌దీపం” అత్త‌కు రియ‌ల్ లైఫ్ భ‌ర్త ఎవ‌రో తెలుసా..? ఏం చేస్తారో తెలిస్తే అవ‌క్కావ్వాల్సిందే..!

“కార్తీక‌దీపం” అత్త‌కు రియ‌ల్ లైఫ్ భ‌ర్త ఎవ‌రో తెలుసా..? ఏం చేస్తారో తెలిస్తే అవ‌క్కావ్వాల్సిందే..!

by AJAY
Ad

తెలుగులో రీసెంట్ టైమ్ లో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన సీరియ‌ల్ కార్తీకదీపం. ఈ సీరియ‌ల్ చూడనివాళ్లు తెలుగు రాష్ట్రాల‌లో ఉండ‌రేమో. ఇక ఈ సీరియ‌ల్ ద్వారా ఎక్కువ పాపులారిటీ దీప అదే ప్రేమి విశ్వ‌నాథ్ సంపాదించుకుంటే ఆ త‌ర‌వాత అంత‌టి గుర్తింపు ఆమె అత్త‌గా న‌టించిన అర్చ‌న అనంత్ సంపాదించుకుంది. అచ్చతెలుగు ఆడ‌పడుచులా క‌నిపిస్తూ అర్చ‌న అనంత్ అభిమానులు సంపాదించుకుంది.

Advertisement

ఈ సీరియ‌ల్ తో పాటూ కేరాఫ్ అన‌సూయ‌, చిరంజీవి ల‌క్ష్మీ సౌభాగ్య‌వ‌తి సీరియ‌ల్స్ కూడా న‌టించింది. వ‌య‌సు చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ త‌న అత్త పాత్ర‌లో జీవించేసింది. అర్చ‌న అనంత్ క‌ర్నాటక‌లోని బెంగుళూరులో జ‌న్మించ‌డంతో పాటూ అక్క‌డే పెరిగింది. ఇక న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తితో మొద‌ట క‌న్న‌డ సీరియ‌ల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

క‌న్న‌డ లో ప‌లు సూప‌ర్ హిట్ సీరియ‌ల్స్ తో అభిమానుల‌ను సంపాదించుకుంది. అంతే కాకుండా ఆ త‌ర‌వాత‌నే కార్తీక‌దీపం సీరియ‌ల్ తో తెలుగులో అడుగుపెట్టింది. ఈ సీరియ‌ల్ లో అత్త పాత్ర‌లో న‌టించి అద‌ర‌గొట్టింది. ఇక అర్చ‌న అనంత్ సీరియ‌ల్స్ లోకి రాక‌ముందు బ్యూటిషీయ‌న్ గా కూడా ప‌నిచేసింది.

అంతే కాకుండా ఫ్యాష‌న్ డిజైన‌ర్ గా కూడా పనిచేసింది. ఇక అర్చ‌న అనంత్ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. అంతేకాకుండా అర్చ‌న త‌ల్లి దండ్రులు కూడా చాలా టాలెంటెడ్ వాళ్లు ఏకంగా ఐదు భాష‌లు అన‌ర్గలంగా మాట్లాడగ‌ల‌రు. అంతే కాకుండా అర్చన త‌ల్లి ప్ర‌భుత్వ ఉద్యోగి కాగా ఆమె తండ్రి కూడా సీరియ‌ల్స్ న‌టించారు.

ALSO READ : ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Visitors Are Also Reading