Home » రాజ‌మౌళి పిలిచి ఆఫ‌ర్ ఇచ్చినా వ‌దులుకున్న అన్ ల‌క్కీ స్టార్స్ వీళ్లే…ఎందుకు వ‌దులుకున్నారంటే..?

రాజ‌మౌళి పిలిచి ఆఫ‌ర్ ఇచ్చినా వ‌దులుకున్న అన్ ల‌క్కీ స్టార్స్ వీళ్లే…ఎందుకు వ‌దులుకున్నారంటే..?

by AJAY

ఒక‌ప్పుడు బాలీవుడ్ ఇండియాలో టాప్ ఇండస్ట్రీ గా ఉంది. దేశం మొత్తం భాషలతో సంబంధం లేకుండా బాలీవుడ్ సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రాజమౌళి సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలని అనుకుంటున్నారు. దాని కారణం జక్కన్న తన సినిమాలతో చేసిన మ్యాజిక్కే. ఈగ, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్ట‌ర్ సినిమాలతో రాజమౌళి దేశంలోనే టాప్ డైరెక్టర్ గా నిలిచారు.

ఆయన సినిమాల్లో చూపించే విజువల్స్, యాక్షన్, ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులకు తెగన‌చ్చేశాయి. కేవలం ఒకే రకమైన కథలతో కాకుండా విభిన్న కథలతో విభిన్న నేపథ్యంలో సినిమాలు చేస్తూ జక్కన్న టాప్ డైరెక్టర్ గా నిలిచారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది.

ఇక అలాంటి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చాన్సులు వ‌స్తే మిస్ చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఆ నటీన‌టులు ఎవరో ఇప్పుడు చూద్దాం….. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవిని అనుకున్నారు. కానీ శ్రీదేవి పెట్టిన కొన్ని కండిషన్స్ వల్ల ఆమె స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారు. అదేవిధంగా బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి పాత్ర కోసం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ని అనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో రానా ను తీసుకున్నారు. అదేవిధంగా బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర కోసం మొదట మోహన్ లాల్ ను అనుకున్నారు. కానీ ఆయన స్టార్ ఇమేజ్ కారణంగా రిజెక్ట్ చేశారు.

అదేవిధంగా మగధీర సినిమాలో సలోని పాత్ర కోసం మొదట నటి అర్చనను సంప్రదించారట. కానీ సైడ్ పాత్రలు చేస్తే కెరీర్ పై ప్రభావం చూపుతుందని అర్చన ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా రాజమౌళి తెర‌కెక్కించిన‌ సూపర్ హిట్ సినిమాలలో విక్రమార్కుడు కూటా ఒకటి. అయితే ఆ సినిమాలో మొదట హీరోగా పవన్ కళ్యాణ్ ను అనుకున్నారు. కానీ పవన్ క‌ల్యాణ్ రిజెక్ట్ చేయడంతో ఆస్థానంలో రవితేజను హీరోగా తీసుకున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్ర కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను అనుకున్నారు. కానీ ఆమె బిజీగా ఉండటంతో ఆస్థానంలో ఆలియా భట్ ను తీసుకున్నారు. యమదొంగ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ కాజల్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

Visitors Are Also Reading