Home » లిక్కర్ బిజినెస్ లోకి కమెడియన్ రఘు…లాక్ డౌన్ లో అలా ఇప్పుడిలా…!

లిక్కర్ బిజినెస్ లోకి కమెడియన్ రఘు…లాక్ డౌన్ లో అలా ఇప్పుడిలా…!

by AJAY
Ad

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మద్యం దుకాణాల వేలం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మద్యం దుకాణాల కోసం తెలంగాణ సర్కార్ రిజర్వేషన్ ను సైతం ఏర్పాటు చేసింది. ఇక ఈ వేలంలో బడాబాబులు కాకుండా సాధారణ మధ్య తరగతి ప్రజలు కూడా కొంత మందితో జతకట్టి టెండర్లు వేశారు. అలా కొంతమంది టెండర్లు దక్కించుకొని అదృష్టవంతులు కాగా మరికొంత మంది డబ్బులు నష్టపోయారు. ఇక ఈ టెండర్లకు వ్యాపారులు మధ్యతరగతి ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది.

Actor Raghu wines bussines

Actor Raghu wines bussines

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రఘు సైతం టెండర్లు దక్కించుకున్నారు. కమెడియన్ రఘుకు నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ పక్కన ఉన్న అభినవ్ 1&2 దుకాణాలను దక్కించుకున్నట్టు సమాచారం. ఇక నిన్నటి నుండి తెలంగాణ వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దాంతో రఘు సైతం తనకు వచ్చిన మద్యం దుకాణాల ముందు పూజలు నిర్వహించి కొద్దిసేపటి వరకు కౌంటర్లో నిలుచుని మద్యం అమ్మారు. రఘు తన స్నేహితులతో కలిసి మద్యం సిండికేట్ లో రెండు దుకాణాలు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా రఘు పలు సినిమాల్లో కామెడీ విలన్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించగా ఆ తర్వాత కాస్త అవకాశాలు తగ్గినట్టే కనిపించాయి.

Advertisement

Advertisement

పిల్ల జమిందార్ సినిమా లో ఆయన పాత్రకు ఎంతో పాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా జబర్దస్త్ లో కొన్ని రోజులు ప్రేక్షకులను అలరించారు. ఇక ఇటీవల లాక్ డౌన్ సమయంలో రఘు వ్యవసాయం సైతం చేశారు. షూటింగ్లకు గ్యాప్ రావడంతో కొద్ది రోజులు తన ఇంటి ఆవరణలో ఆర్గానిక్ కూరగాయలను పండించారు. ఆ తర్వాత తానే సొంతంగా 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. ఇక ఇప్పుడు లిక్కర్ బిజినెస్ లోకి సైతం దిగారు. మరి రఘు పూర్తిగా వ్యాపారంలో స్థిరపడతారా లేదంటే సినిమాలు కూడా చేస్తారా అన్నది చూడాలి.

Visitors Are Also Reading