Home » ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అవుతున్న నటుడు నరేష్..? వధువు ఎవరంటే..!

ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అవుతున్న నటుడు నరేష్..? వధువు ఎవరంటే..!

by AJAY
Published: Last Updated on
Ad

నటుడు నరేష్ టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పటి హీరోయిన్ విజయనిర్మల కుమారుడే నరేష్. కెరీర్ ప్రారంభంలో 80- 90 కాలంలో నరేష్ హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. జంబలకడి పంబ సినిమా లో నరేష్ హీరోగా నటించగా ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే హీరోగా మాత్రం అనుకున్నమేర సక్సెస్ కాలేకపోయాడు. దాంతో నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. తండ్రిగా కమెడియన్ గా ఇలా అనేక పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు.

 

Advertisement

ప్రస్తుతం మెయిల్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నరేష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక మా ఎలక్షన్ల సమయంలోనూ నరేష్ ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటారు. ఇదిలాఉంటే నరేష్ ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నరేష్ మొదటగా రేఖ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ వెంటనే నరేష్ రమ్య రఘుపతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

Advertisement

చాలా కాలం పాటు వీరి వివాహ బంధం సక్రమంగానే సాగింది. ఇదిలా ఉంటే రమ్య ఇటీవల చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. దాంతో నరేష్ ఓ వీడియోను బయటకు వదిలాడు. అందులో తనకు రమ్య తో ఎలాంటి సంబంధం లేదని తాము విడాకులు తీసుకున్నామని ప్రకటించాడు. తన పేరు చెప్పి రమ్య మోసాలకు పాల్పడుతుందని…. ఎవరూ నమ్మవద్దని అన్నాడు. ఇది ఇలా ఉండగానే నరేష్ ఇప్పుడు మూడో పెళ్ళికి సిద్ధమైనట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

వీరి పెళ్ళికి తేదీ కూడా ఫిక్స్ అయ్యింది అంటూ టాక్. అంతేకాకుండా నరేష్ వల్లే పవిత్ర లోకేష్ కు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని కూడా బయట టాక్ వినిపిస్తోంది. ఇక పవిత్ర లోకేష్ కు గతంలో వివాహం జరగగా ఆమె కూడా భర్తతో విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా నరేష్ పవిత్ర పెళ్లి పై వార్తలు వస్తున్నా ….పవిత్ర లోకేష్ కానీ నరేష్ కానీ ఆ వార్తలను ఖండించలేదు. మరి వీరి వివాహం జరుగుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read: 

గోపిచంద్ రూ.10వేలు అడ‌గ్గానే వెంట‌నే గూగుల్ పే చేసిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading