ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసూప్‌గూడలో జరిగిన విషయం తెలిసిందే. అయితే అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎమోషనల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా దర్శక ధీరుడు, అగ్రదర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ నేను మా మాన్న గారిని ఇన్ని సంవత్సరాల్లో చూసి ఎంత నేర్చుకున్నానో తెలియదు కానీ.. మారేడిమిల్లిలో 20 రోజులు దగ్గరగా చూసి నేర్చుకున్న దాంతో పోల్చితే 20 సంవత్సరాలు నథింగ్ అనిపిస్తోందని చెప్పారు. అలాంటి అవకాశం ఇచ్చినందుకు కొరటాల శివకు థాంక్స్ చెప్పారు. ఇక రాజమౌళి గారికి మా అమ్మగారి తరుపున ప్రత్యేక థాంక్స్. ఆ మాట మా అమ్మ నీతో చెప్పమన్నది.
Advertisement
కొరటాల శివతో మిర్చి నుంచి మేము కలిసి ఓ ప్రాజెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ నా కమిట్‌మెంట్స్, ఆయన కమిట్‌మెంట్స్ వల్ల మేము చేయలేకపోయాం. ఏది జరిగినా ఆయన మంచికే అని ఎందుకు అంటారో నాకు ఇవాళ ఆచార్య వల్లే తెలిసింది. మా నాన్నతో కొరటాల డైరెక్షన్ లో చేయాలని రాసుండడం వల్లనే ఇంతకాలం ఆగి ఉంటాం. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చూసినప్పుడు శివగారి సినిమాల్లో ఓ బుద్ధుడు, వివేకనందుడు ఆ గెటప్‌లో అంటే.. బయటికి తారక్, మహేష్ తప్ప లోపల సోల్ వివేకానంద, బుద్ధుడు కనిపిస్తుంటారు.
Advertisement
కథలో, రైటింగ్‌లో బలం ఉంటే యాక్టర్స్ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయక్కరలేదని ఆచార్యలో పని చేసిన తరువాత అర్థమైంది. సింపుల్‌గా ఆ మాటలు చెబితే ఆ మాటల్లోనే ఓ ఫైట్, పవర్ ఉంటుంది. అది శివగారి రైటింగ్‌లో ఉంటుంది. ఆచార్య సినిమా షూటింగ్‌లో వాస్తవానికి 20 రోజులు మేకప్‌లు వేయించుకునే వాళ్లం. ఇది నిజం చాలా గొప్ప విషయం నాకు. దీనిని నేను జీవితాంతం మనసులో ఉంచుకుంటాను. ఎమోషనల్ కాకూడదు అని అనుకున్నా. మరొక వైపు బొమ్మరిల్లు ఫాదర్ అని చలోక్తులు విసిరారు చరణ్. నాన్నగారితో నాకు ఇలాంటి సందర్భం రావడానికి 13 ఏళ్లు పట్టింది. ఇలాంటి అవకాశమే రావాలని నేను కోరుకోను. ఎందుకు అంటే నాకు, నా జీవితానికి ఇది చాలు. ఆయన కొడుకుగా పుట్టినందుకు ఇది చాలు. థాంక్యూ డాడీ అని ఎమోషనల్ స్పీచ్ ముగించారు రామ్ చరణ్.
Also Read :
RGV నాగార్జునల శివ సినిమా స్టోరీ విని ఇండస్ట్రీలో ఏమనుకున్నారో తెలుసా ?
స్కిన్ షో కు అందుకే దూరంగా ఉంటా..కీర్తీ సురేష్ సంచలన వ్యాఖ్యలు..!