మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. రామ్ చరణ్ దాదాపు 30 నిమిషాల పాటు స్క్రీన్ పై కనిపించారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటించింది. మొదట కాజల్ అగర్వాల్ మెగాస్టార్ సరసన నటిస్తున్నట్లు ప్రకటించారు.
Advertisement
కానీ ఆ తర్వాత నక్సలైట్ పాత్రకు లవ్ స్టోరీ సెట్ కాదు అనే కారణంతో కాజల్ ను తప్పించినట్లు కొరటాల శివ తెలిపారు. అయితే ఈ సినిమాకు దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాలో కొన్ని పాటలు, చిరంజీవి రామ్ చరణ్ నటన తప్ప చెప్పుకోదగ్గ అంశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Advertisement
గతంలో వచ్చిన కొరటాల సినిమాలన్నీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆచార్య పై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో తీవ్ర నిరాశ చెందారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దాంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తాన్ని పెట్టి సినిమాను కొనుగోలు చేశారు. అయితే సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. దాంతో ఆచార్య సినిమాకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.
తాజాగా ఆచార్య డిస్ట్రిబ్యూటర్ లలో ఒకరైన రాజగోపాల్ బజాజ్ చిరంజీవి కి బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే కరోనా కారణంగా తాము అప్పుల పాలయ్యామని.. ఈ సినిమాకు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టామని తెలిపారు. కానీ తాము పెట్టుబడి పెట్టిన దాంట్లో కనీసం 25 శాతం కూడా రాలేదని తమను ఆర్థికంగా ఆదుకోవాలని రామ్ గోపాల్ బజాజ్ లేఖలో పేర్కొన్నారు. మరి ఈ లేఖ పై మెగాస్టార్ చిరంజీవి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
Also read :
శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఒక్క ఎపిసోడ్ ను ఎన్ని రోజులు షూట్ చేస్తారో మీకు తెలుసా..?
ఆ హీరోయిన్ విషయంలో బాలకృష్ణ రవితేజను కొట్టారా..? అసలేం జరిగింది..!