ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయవచ్చు. ఆచార్య చాణక్య నీతి ప్రకారం.. సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏది సరైంది, ఏది తప్పు అని అర్థం కాదు. అందువల్ల ఒక వ్యక్తి సులభంగా నిర్ణయం తీసుకోలేడు. ఆచార్య చాణక్య విధానం వ్యక్తికి అన్ని విధాలుగా స్పూర్తిని ఇస్తుంది. ఈ విధానాల నుంచి సమాజంలో మంచి, చెడు, జీవన విధానాన్ని వేరు చేయడం నేర్చుకోవచ్చు. ప్రజలు ప్రతి కష్టం నుంచి పోరాడడానికి కూడా ఒక మార్గం పొందుతారు. ఆచార్య చాణక్య ఇలాంటి వాటి కోసం 4 విధానాలు వివరించారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- ఆచార్య చాణక్యుడు సంక్షోభ సమయంలో ప్రతి నిర్ణయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పాడు. సంక్షోభం వచ్చినప్పుడు సవాళ్లు చాలా పెద్దవి. అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితిపై ప్రతి నిర్ణయం వ్యక్తి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.
- ఆచార్య చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తి సంక్షోభ సమయానికి ముందుగానే కొన్ని సన్నాహాలు చేస్తే.. అతని కష్టకాలం సులభంగా బయటపడవచ్చు. డబ్బు, ఆహారం మొదలైన వాటిని నిలువ చేసుకోవాలి. వారు చెడు సమయాల్లో మీకు చాలా సహాయకారిగా ఉంటారు.
Advertisement
Advertisement
- సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యత వహించడమే ప్రథమ కర్తవ్యం అని చాణక్య నీతి చెబుతుంది. కుటుంబ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు వారు ఒకరికొకరు మాత్రమే తమ పూర్తి సాయాన్ని అందించాలి. ఒక కుటుంబం ఇబ్బందులను అధిగమించగలదు.
- సంక్షోభ సమయంలో ఏదైనా వ్యూహం వేసే ముందు దాని మంచి, చెడు పరిమాణాల గురించి ఒకసారి ఆలోచించాలని ఆచార్య చాణక్య చెప్పారు. ఆ తరువాత పటిష్టమైన వ్యూహంతో మాత్రమే పని చేయండి. పూర్తి వ్యూహంతో ముందుకు సాగే ఒక వ్యక్తి ప్రతి కష్టాన్ని చాలా సులభంగా అధిగమిస్తాడు.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు