Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 28.07.2022: మేషం

 

ల‌క్ష్యాల‌ను చేరుకునే దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తారు. పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వ మ‌ర్యాద‌లు క‌లిగి ఉంటారు. వ‌స్త్ర లాభం పొందుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

తోటివారితో క‌లిసి తీసుకునే నిర్ణ‌యం మేలు చేస్తుంది. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. మ‌నఃపీడ ఉంటుంది.

Today rashi phalau in telugu: మిథునం

విఘ్నాల‌ను తెలివిగా ప‌రిష్క‌రిస్తారు. చంచ‌ల స్వ‌భావంతో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. మీ పై అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం. దుష్టుల‌ను ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

స‌కాలంలో ప‌నులు పూర్త‌వుతాయి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. బందు, మిత్రుల‌తో క‌లిసి కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుని భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు అంచ‌నా వేస్తారు.

Today rashi phalau in telugu : సింహం

మీ రంగంలో శ్ర‌మ పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. మీ బంధువుల ప్రవ‌ర్త‌న మీకు మ‌న‌స్థాపాన్ని క‌లిగిస్తుంది. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. ధ‌న‌వ్య‌యం పెరిగే అవ‌కాశాలున్నాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టిన ప‌నుల్లో ఒక‌టి రెండు ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మిస్తారు. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

ప‌ట్టుద‌ల‌తో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖ‌ర్చులుంటాయి. ముఖ్య విష‌యాల్లో ఆచితూచి అడుగు వేయాలి. క‌ల‌హ సూచ‌న ఉంది కాబ‌ట్టి మాట విలువ‌ను కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ధ‌ర్మ సిద్ధి ఉంది. స‌మ‌స్య‌లు తొలిగి కుదురుకుంటారు. భోజ‌న సౌఖ్య‌ముంది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

మీమీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఆత్మ‌విశ్వాసం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం ఉత్త‌మం.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఆయా రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబ‌లం బాగుండ‌డం వ‌ల్ల కీల‌క స‌మ‌యాల్లో పెద్ద‌లు లేదా అధికారుల మెప్పు పొందుతారు.

Today rashi phalau in telugu : కుంభం

ఆయా రంగాల్లో ప్రోత్సామ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. సంతోష‌క‌ర‌మైన కాలాన్ని గ‌డుపుతారు. ఒక వార్త మీకు మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల‌దూర్చ‌రాదు.

Today rashi phalau in telugu :  మీనం

బ‌ల‌మైన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. ధ‌న‌, ధాన్య‌వృద్ధి ఉంది. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీకు ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Visitors Are Also Reading