సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక వ్యక్తిని తమకంటే ఎక్కువగా నమ్ముతారు. కొంత మంది నమ్మకానికి అడ్డుపెట్టుకుని మన వెనకే గొంతులు తీస్తారు. మనం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు. ఇలాంటి సంఘటనలు నిత్యం చుట్టుపక్కల సమాజంలో చూస్తుంటాం. ఇక చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి వారిని ఎప్పటికి విశ్వసించకూడదు. వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఎవ్వరినీ నమ్మాలో, ఎవరినీ నమ్మకూడదో నిర్ణయించుకోవడం అంత సులభం కాదు. అసలు అలాంటి వారిని ఎక్కువగా నమ్మడం వల్ల మీరు మోసానికి గురవుతారు. ఎలాంటి వ్యక్తులను నమ్మితే మీకు హానికరమో మీరు తెలుసుకోండి.
ఆయుధాలు కలిగిన వ్యక్తి :
Advertisement
చాణక్య నీతి ప్రకారం.. ఆయుధాలు చేతిలో ఉన్న వ్యక్తులను విశ్వసించడం ప్రమాదకరం. అలాంటి వ్యక్తి కోపంతో మీపై దాడి చేయడానికి వెనుకాడరు. అలాంటి వారికి దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది.
అధికారులకు సన్నిహితుడు :
Advertisement
అధికారులతో సన్నిహితంగా ఉన్న వారిని ఎప్పటికీ విశ్వసించలేరు. కొంతమంది ఉన్నతాధికారుల సేవకులను, స్నేహితులను నమ్మి వారి యొక్క బాధలను చెప్పుకుంటారు. కానీ అలాంటి వ్యక్తలు మిమ్మల్నిఉపయోగించుకోవడానికి వెనుకాడరు. మరిచిపోయి కూడా అలాంటి వారిని ఎప్పుడు నమ్మవద్దు. చాణక్యనీతి ప్రకారం.. కొంతమంది ప్రజలు తమ మంచి గురించి మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తులను విశ్వసించడం ప్రమాదకరం. అదేసమయంలో స్వార్థపూరిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే స్వార్థపరుడు తన స్వార్థ ఆలోచనను నెరవేర్చడానికి ఎంతకైన వెళ్లవచ్చు.
ప్రశాంతంగా ఉన్న నదిని నమ్మవద్దు :
చాణక్యనీతి ప్రకారం.. ప్రజలు నదిని ఎప్పుడు నమ్మకూడదు. కొంతమంది నది ప్రశాంతత స్వభావాన్ని చూసి నది లోతును అంచనా వేయడం ప్రారంభిస్తారు. అయితే బయట నుంచి ప్రశాంతంగా కనిపించే నది లోపల భారీగా, ప్రమాదకరంగా ఉంటుంది. అదే సమయంలో చివరలో ప్రశాంతంగా అనిపించే నది ప్రవాహం మధ్యలో చాలా వేగంగా ఉంటుంది.
కొమ్ములు, గోర్లు ఉన్న జంతువులు :
చాణక్య నీతి ప్రకారం.. జంతువులను కూడా నమ్మడం మూర్ఖత్వం ఎందుకంటే జంతువులు ఎప్పుడైనా మీపై దాడి చేయవచ్చు. ముఖ్యంగా కొమ్ములు, గోళ్లు ఉన్న ఎందుకంటే జంతువులు ఎప్పుడైనా మీపై దాడి చేయవచ్చు. ముఖ్యంగా కొమ్ములు, గోళ్లు ఉన్న జంతువులకు దూరంగా ఉండడం మంచిది. అదే సమయంలో కొమ్ములు మరియు గోళ్లతో భయంకరమైన జంతువులను పెంచడం మానుకోవాలి.
Also Read :
Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ప్రతిభతో కీర్తిని సంపాదిస్తారు