Home » Chanakya Niti : అలాంటి గురువుని త్వరగా వదిలేయండి.. లేకపోతే నష్టమే..!

Chanakya Niti : అలాంటి గురువుని త్వరగా వదిలేయండి.. లేకపోతే నష్టమే..!

by Anji
Ad

గురువు అంటే మార్గదర్శి నిపుణుడు, ఉపాధ్యాయుడు అనిఅందరికీ తెలుసు. భారత సంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుడి కంటే ఎక్కువ సాంప్రదాయకంగా గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి. గురువు శిష్యునికి జీవిత విలువలను నేర్పించే బోధకుడు, సాహిత్య జ్ఞానంతో పాటు, తన అనుభవ జ్ఞానాన్ని పంచేవాడు. విద్యార్థి జీవితంలో ఒక ఆదర్శ వ్యక్తి, స్పూర్తి దాయకమైన వ్యక్తి, విద్యార్థి ఆధ్యాత్మిక పరిణామంలో సహాయపడేవాడు. సాధారణంగా గురువుకి ఉన్న సామర్థ్యాలను శిష్యునికి అందించడంలో సాయం చేస్తాడు. అదే గురువు దారి తప్పితే ఏం చేయాలనే విషయం చాణక్యుడు వివరించాడు. 

chanakya-niti

chanakya-niti

ప్రతీ వ్యక్తి తన తొలి గురువు అతని తల్లిదండ్రులు, తరువాత పాఠశాలలో ఉపాధ్యాయులు, అతని సొంత అనుభవాలు అతని జ్ఞానాన్ని పెంచుతాయి. గురువు గోవిందుడితో సమానం అని వర్ణించారు. గురువు లేకుండా శిష్యుడు జ్ఞానం పొందడం అసాధ్యం. ధర్మం, అధర్మం అనే భేద జ్ఞానం గురువు ద్వారా మాత్రమే లభిస్తుంది. ఒక శిష్యుడు తన గురువు పట్ల ఎంత అంకిత భావంతో ఉండాలో తన శిష్యులకు సరైన మార్గాన్ని చూపడం కూడా ఎంత  అంకిత భావంతో తన శిష్యులకు సరైన మార్గాన్ని చూపడం కూడా గురువు విధిగా మారుతుందని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో గురువును, స్త్రీని, మతాన్ని, బంధువులను ఎప్పుడూ త్యాగం చేయాలో కూడా చాణక్యుడు వెల్లడించాడు. ముఖ్యంగా దయలేని మతాన్ని విడిచిపెట్టడం అసలు మంచిది కాదు అని చాణక్యుడు చెప్పాడు. మతానికి ఆధారం దయ, కరుణ. ఏ ప్రాణికైనా కరుణించడం మనం ప్రాథమిక ధర్మం. ఎప్పుడూ దయతో ఉండే వ్యక్తి ఆనందానికి అంతు ఉండదు. 

Advertisement

Advertisement

Also Read :  అలనాటి స్టార్ యాక్టర్ జగయ్య మనవడు కూడా వెండి తెరపై నటిస్తున్నాడనే విషయం మీకు తెలుసా ?

గురువు శిష్యునికి మార్గనిర్దేశం చేస్తాడు. సరైన విద్యతో అతడిని కబీర్ గా చేయడానికి మంచి, చెడుల మధ్య తేడాను బోధిస్తాడు. చాణక్యుడి ప్రకారం.. గురువుకు జ్ఞానం లేకపోతే అతని శిష్యునికి ఎలా మేలు చేస్తాడు. గురువు వద్ద విద్యను అభ్యసించడం వల్ల డబ్బు నష్టపోవడమే కాకుండా మీ భవిష్యత్  అంతా పాడు చేయవచ్చు. అలాంటి గురువును వంటనే వదిలేయడం మంచిది. సంబంధాలు ప్రేమ, విశ్వాసంతో కట్టుబడి ఉంటాయి. చాణక్యుడి ప్రకారం.. మీ పట్ల ప్రేమ, ఆప్యాయత లేని బంధువుల నుంచి దూరం చేయడం మంచిది. బంధువులు పేరుకు మాత్రమే ఉంటారు. మీరు ఆపదలో ఉన్నప్పుడు వారు మీకు దూరంగా ఉంటారు. 

Also Read :  ఈ 3 లక్షణాలున్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోరాదు.. కారణం ఇదే..!!

Visitors Are Also Reading