దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించారు. ఇప్పటికే సినిమా టీజర్ మరియు ట్రైలర్ లను విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మిలియన్ల సంఖ్యలో టీజర్ ట్రైలర్ లకు వ్య్వూవ్స్ వచ్చాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు.
ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సిం ఉంది.కానీ కరోనా కేసుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం కరోనా పూర్తిగా తగ్గుముకం పడుతుండటంతో ఒక్కో సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే వాయిదా పడిన పలు చిత్రాలను విడుదల చేశారు. కాగా ఈ సినిమాను కూడా మార్చి 25న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక విడుదలకు ముందే ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ క్రేజ్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
Also Read: కెనడాలో ఆర్ఆర్ఆర్ క్రేజ్…వీడియో వైరల్….!
Advertisement
రీసెంట్ గా విదేశాల్లో కార్లతో ఆర్ఆర్ఆర్…ఎన్టీఆర్ అంటూ పేర్లను రాసి విన్యాసాలు చేశారు. మరోవైపు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తిక విషయం నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
సినిమా ట్రైలర్ లో బోటు ప్రమాదం జరిగిన సమయంలో ఓ జెండాను చూపిస్తారు…అదే జండాను రీసెంట్ గా విడుదల చేసిన జండా అనే పాటలో చూపించారు. ఇక ఆ జెండా ఎక్కడిదో కాదు. దాని వెనకాల ఒక చరిత్రనే ఉంది. వందేమాతరం అని మధ్యలో రాసి కనిపిస్తున్న ఆ జెండా కలకత్తా ఫ్లాగ్…..మన దేశ స్వాతంత్య్ర జండా అదే… ఈ జెండాను బికాజీ కామా 1907లో ఆగస్టు 22న తయారు చేశారు. జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో దీనిని ప్రదర్శించారు.
Also Read: RRR క్లైమాక్స్ లీక్ ! అసలు దీనికి తారక్ ఫాన్స్ ఒప్పుకుంటారా ?